66 Policemen Transfer Kerala Vadakara Police Station
66 policemen transfer Kerala Vadakara police station : పోలీసులు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు లేదా మరో గ్రామానికో జిల్లాలో ట్రాన్సఫర్ కావటం సర్వసాధారణమే. కానీ కొన్ని కీలక కేసుల విషయంలో ఆయా స్టేషన్లకు చెందిన పోలీసులు విఫలం అయ్యారనో..లేదా మరేదైనా కారణాలు బదిలీలు చేస్తుంటారు ఉన్నతాధికారులు. కానీ ఒకే స్టేషన్ కు చెందిన 66మంది పోలీసులు ఒకేసారి బదిలీ కావటం అనేది బహుశా జరిగి ఉండకపోవచ్చు. కానీ కేరళ ప్రభుత్వం మాత్రం ఓ కేసు విషయంలో 42 ఏళ్ల వ్యక్తి పోలీసు కస్టడీ నుంచి విడుదలైన మృతిచెందాడు. దీంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ఆ కేసుతో సంబంధం ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా ఆ పోలీసుస్టేషన్‌కు చెందిన 66 మంది పోలీసులను బదిలీ చేసింది. సదరు వ్యక్తి మృతి చెందటంతో ప్రజలు ఆందోళనలు చేశారు. కానీ అప్పటికే పినరయి విజయన్ ఆధ్వర్యంలో రాష్ట్ర హోంశాఖ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. రూరల్ ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా..విధానపరమైన లోపాలను పేర్కొంటూ కన్నూర్ డీఐజీ ఆ స్టేషన్ ఎస్సై సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసింది.
గత వారం కొయ్‌కోడ్‌లోని వడకర సమీపం తెరువాత్‌లో గతవారం సంజీవన్ (42) అనే వ్యక్తి కారు.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకుని సంజీవన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటికే అస్వస్థతకు గురైన సంజీవన్‌ను పోలీసులు వేధించార ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతం సంజీవన్ ను కష్టడీ నుంచి విడుదల చేయగా సంజీవన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్నేహితులు సమీప ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు.
పోలీసులు చిత్రహింసలు పెట్టటం వల్లే సంజీవన్ అస్వస్థతకు గురైయ్యాడని అయినా పోలీసులు పట్టించుకోలేదని.. సంజీవన్ కుటుంబ సభ్యులు, బంధువులు,స్నేహితులు ఆరోపించారు. ఇది కచ్చితంగా లాకప్ డెత్ అంటూ పోలీసుల తీరుపై మండిపడుతూ రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు, ఈక్రమంలో మానవహక్కుల సంఘం స్పందించింది.సంజీవన్ మృతిపై నివేదిక సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది. ఈక్రమంలో అధికారులపై పినరయి విజయన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న 66 మంది పోలీసులను బదిలీ చేస్తూ.. హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.