Nandigram : నందిగ్రామ్ ఓట్ల లెక్కింపులో గందరగోళం..సుప్రీంకోర్టుకి మమత

NANDIGRAM నందిగ్రామ్ ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. తొలుత మమతాబెనర్జీ గెలిచినట్లు..ఆ తర్వాత సువెందు అధికారి గెలిచినట్లు వార్తలు వచ్చాయి. అయితే నందిగ్రామ్ లో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. నందిగ్రామ్ ఫలితం ఇంకా అధికారికంగా రాలేదని తృణముల్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఇక, నందిగ్రామ్ లో తనను ఓడించేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర చేసిందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నందిగ్రామ్ ఎన్నికపై సుప్రీంకోర్టుకెళ్తానని మమత ప్రకటించారు.

మరోవైపు,214స్థానాల్లో ఘనవిజయం సాధించింది టీఎంసీ. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కుంచుకోవాలనుకున్న బీజేపీ..కేవలం 77స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ముచ్చటగా మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టనున్నారు మమతాబెనర్ఝీ.

ట్రెండింగ్ వార్తలు