నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు.. అకస్మాత్తుగా రోడ్డుపైకొచ్చిన ఆవు.. ఆ తరువాత జరిగిందిదే.. వీడియో వైరల్

నేషనల్ హైవేలపై వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. ఆ సమయంలో ఏ జంతువైనా.. వాహనమైనా అకస్మాత్తుగా అడ్డువస్తే ..

SUV flipped and skidded on National Highway

SUV flipped and skidded on National Highway: నేషనల్ హైవేలపై వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. ఆ సమయంలో ఏ జంతువైనా.. వాహనమైనా అకస్మాత్తుగా అడ్డువస్తే ఆ తరువాత ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. ఒక్కోసారి పెద్ద ప్రమాదమే జరుగుతుంది. సరిగ్గా.. ఇలాంటి తరహా ఘటన మంగళవారం మధ్యప్రదేశ్‌లోని శివపురి సమీపంలోని జాతీయ రహదారి-46పై చోటు చేసుకుంది.

జాతీయ రహదారి-46పై వేగంగా వెళ్తున్న వాహనానికి ఒక్కసారిగా ఆవు అడ్డు వచ్చింది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై ఆవును ఢీకొట్టకుండా వాహనాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ వాహనం పల్టీకొట్టి 100 అడుగులు దూరం జాతీయ రహదారిపై జారుడు బల్లపై జారుకుంటూ వెళ్లినట్లుగా దూసుకెళ్లింది. ఈ సమయంలో పెద్ద శబ్ధం వచ్చింది. ఈ ఘటన స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకింత భయాందోళన వ్యక్తం చేస్తూనే ఆశ్చర్యపోతున్నారు.


ఈ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి యూపీకి చెందిన రాజా సాహ్నిగా గుర్తించారు. అతనితోపాటు మరో వ్యక్తి వాహనంలో ఉన్నాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై గాయపడిన వారిద్దరినీ అంబులెన్సు ద్వారా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారికి స్వల్ప గాయాలేకావడంతో ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.