Chhattisgarh Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా 11మంది మృతి

ఛత్తీస్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ)ను ట్రక్కు ఢీకొట్టిన ప్రమాదంలో ఎస్‌యూవీ వాహనంలో ప్రయాణిస్తున్న 11 మంది మరణించారు. వీరంతా బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్తున్నారు.

Chhattisgarh Accident: ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ)ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులతో సహా 11 మంది మరణించారు. ధామ్‌తరి జిల్లాలోని సోరం – భట్‌గావ్ గ్రామానికి చెందిన స్థానికులు కంకేర్ జిల్లా మర్కటోలా గ్రామంలో వివాహానికి హాజరయ్యేందుకు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ)లో వెళ్తున్నారు. బుధవారం రాత్రి జాతీయ రహదారి -30పై పురూర్ పోలీస్ స్టేషన్ పరిధి జగ్తారా గ్రామ సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

Ayodhya Road Accident: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, బస్సు ఢీకొని ఏడుగురు మృతి

ఈ ప్రమాదంలో మహీంద్రా బొలెరోలో ప్రయాణిస్తున్న పది మంది వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు పురూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ అరుణ్ కుమార్ సాహు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ ను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Road Accident : షాకింగ్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం, రోడ్డుపై కారు బీభత్సం

విషాద ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని, వారి కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ట్విటర్ ద్వారా ముఖ్యమంత్రి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు