Ayodhya Road Accident: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, బస్సు ఢీకొని ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో లక్నో - గోరఖ్‌పూర్ హైవే‌పై ట్రక్కు, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.

Ayodhya Road Accident: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, బస్సు ఢీకొని ఏడుగురు మృతి

Ayodhya Road Accident

Ayodhya Road Accident: అయోధ్య (Ayodhya) లో ఘోర రోడ్డు ప్రమాదం (Fatal road accident) చోటు చేసుకుంది. ట్రక్కు (Truck) , బస్సు  (Bus)  ఒకదానికొకటి ఢీకొనడంతో ఏడుగురు మరణించారు. మరో 40మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను అంబులెన్సుల సహాయంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ట్రక్కు, బస్సు ఢీకొనడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. దీంతో క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసేందుకు సహాయక సిబ్బందికి కష్టతరంగా మారింది.

Road Accident : విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి మూడేళ్ల బాలుడు మృతి

లక్నో – గోరఖ్‌పూర్ హైవే పై ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు వస్తున్న క్రమంలో ప్రైవేట్ బస్సు అంబేద్కర్ నగర్ వైపు వెళ్లేందుకు హైవేపై టర్న్ తీసుకుంటుంది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్రక్కు బోల్తాపడి బస్సు కొందపడిపోయిందని అయోధ్య చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారని, 40 మందికిపైగా గాయపడ్డారని తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

TSRTC: ప్రయాణికుల పట్ల సత్‭ప్రవర్తనపై కండక్టర్లకు కీలక సూచన చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనర్

ఘోర ప్రమాద ఘటనపై యూపీ సీఎం ఆధిత్య నాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపినట్లు సీఎంఓ హిందీలో ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.