Maurya vs Bhagwat: భారత్ హిందూ దేశం కాదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‭కు స్వామి ప్రసాద్ మౌర్య కౌంటర్

శుక్రవారం సకల్ జైన సమాజ్ కార్యక్రమంలో భగవత్ ప్రసంగిస్తూ, శతాబ్దాలుగా మన దేశం పేరు భారత్ అనే ఉందని అన్నారు. ఏ భాష అయినా పేరు అలాగే ఉంటుందని, కానీ మన దేశం విషయంలో ఒక భాషల్లో ఒక్కోలా ఉందని అన్నారు

Hindu Nation Remark: హిందూ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఎదురుదాడి చేశారు. భారతదేశం హిందూ దేశం కాదని, గతంలో ఎప్పుడూ హిందూ దేశం కాదని మౌర్య అన్నారు. ఆయన ఇంతకుముందు కూడా హిందూ మతానికి సంబంధించి పలుమార్లు చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అదే తరహాలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

Mohan Bhagwat: మన దేశం పేరు ఇడియా కాదు, భారత్.. అలాగే పిలవాలంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్

స్వామి ప్రసాద్ శనివారం తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..‘‘భారతదేశం హిందూ దేశం కాదు. గతంలో ఎన్నడూ హిందూ దేశంగా లేదు. ఇది సార్వభౌమాధికార దేశం, మన రాజ్యాంగం లౌకిక దేశం అనే భావనపై ఆధారపడింది. భారతదేశ ప్రజలందరూ భారతీయులే. మన భారత రాజ్యాంగం అన్ని మతాలు, వర్గాలు, వర్గాలు, సంస్కృతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది’’ అని హిందీలో ట్వీట్ చేశారు. దానిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల ప్రకటనను షేర్ చేశారు. అందులో.. భారతదేశంలో నివసిస్తున్న భారతీయులందరూ హిందువులని, భారతదేశం హిందూ దేశమని మోహన్ భగవత్ అన్నారు.

Chandrayaan-3: ఆదిత్య ఎల్-1 విజయవంతం కాగానే మరో గుడ్ న్యూస్.. చంద్రుడిపై సెంచరీ కొట్టిన చంద్రయాన్-3

శుక్రవారం సకల్ జైన సమాజ్ కార్యక్రమంలో భగవత్ ప్రసంగిస్తూ, శతాబ్దాలుగా మన దేశం పేరు భారత్ అనే ఉందని అన్నారు. ఏ భాష అయినా పేరు అలాగే ఉంటుందని, కానీ మన దేశం విషయంలో ఒక భాషల్లో ఒక్కోలా ఉందని అన్నారు. అందుకే మనమంతా ఇండియా అనే పేరును ఉపయోగించడం మానేసి, అన్ని ఆచరణాత్మక రంగాలలో భారత్‌ని ఉపయోగించాలని, అప్పుడే మార్పు వస్తుందని ఆయన అన్నారు. ఇది కాకుండా, మరొక ప్రసంగంలో హిందూ దేశం గురించి మాట్లాడుతూ, మనది హిందూ దేశమని, సైద్ధాంతికంగా భారతీయులందరూ హిందువులే, హిందువు అంటే భారతీయుడని భగవత్ అన్నారు.