కరోనా కట్టడికే తొలి ప్రాధాన్యం..మే-20 తర్వాతే విజయన్ ప్రమాణస్వీకారం

ఆదివారం విడుదలైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి వరుసగా రెండోసారి

Pinarayi Vijayan ఆదివారం విడుదలైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి వరుసగా రెండోసారి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అధికార ఎల్​డీఎఫ్ 99 స్థానాల్లో గెలుపొంది రెండోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్​ 41 స్థానాలకే పరిమితమైంది. భాజపా ఖాతా తెరవలేకపోయింది.

దీంతో మరోసారి సీఎం పగ్గాలు చేపట్టనున్నారు పిన్నరయి విజయన్ కుమార్. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో తన ప్రమాణస్వీకార విషయం పిన్నరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే-20 తర్వాతే పినరయి విజయన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణాస్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరపనున్నట్లు తెలుస్తోంది. మే 17న మంత్రుల జాబితా ఖరారు చేయనున్నట్లు సమాచారం. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో వైరస్ నియంత్రణకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్​డీఎఫ్​ విజయం సాధించిన నేపథ్యంలో విజయన్ సోమవారం తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే గవర్నర్​ ​ఆరిఫ్ మహ్మద్​ ఖాన్​ కోరిక మేరకు తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మే-18 తర్వాత కొత్త సీఎంగా విజయన్ ప్రమాణస్వీకారం చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు