MPs Suspened form parliament: 78 మంది ఎంపీలను ఓకే రోజు సస్పెండ్ చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని..ఇది పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ..బీజేపీ ప్రభుత్వం సిగ్గు పడాలి అంటూ టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మండిపడ్డారు. వికసిత్ భారత్ అంటే ఇదేనా.. ? అంటూ ప్రశ్నించారు. లోక్ సభలోకి ఇద్దరు అగంతకులు రావడం భయభ్రాంతులకు గురి చేసిందని..ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు..కానీ ఏమైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి..? అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ భధ్రతపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది..?ఇంత పెద్ద ఘటన జరిగితే హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదు..? అని ఆగ్రహంగా ప్రశ్నించారు.
పార్లమెంట్ పై ముష్కరుల దాడి జరిగిన రోజే మరోసారి ఇటువంటి ఘటన జరగడం భధ్రత వైఫల్యం కాకమరేమిటి.. దీనిపై పార్లమెంట్ లో చర్చ జరగాలని పట్టుబడితే ఎంపీలను సస్పెండ్ చేయటాని బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరముందన్నారు.మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంస్థ నివేదిక ఇచ్చిందని..కానీ రాష్ట్ర ప్రభుత్వం అటువంటిది జరగలేదని చెబుతోంది..అందుకే సీబీఐ విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని తాము ఢిల్లీ హైకోర్టులో నవంబర్ 25నే పిటీషన్ వేసామని తెలిపారు.మేడిగడ్డ నిర్మాణంలో జరిగిన లోపాలను బీఆర్ఎస్ ప్రభుత్వం దాచి పెట్టిందని విమర్శించారు.
Parliament Winter Session 2023: లోక్‌సభ నుంచి మరో 49 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
కాగా..పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ సెషన్ లో ఉభయ సభల్లో సోమవారం (డిసెంబర్ 18,2023)వరకు 95 మంది సభ్యులను సస్పెన్డ్ చేయగా.. మంగళవారం మరో 49 మంది విపక్ష సభ్యుల్ని సస్పెన్డ్ చేశారు. దీంతో ఈ సెషన్‌లో సస్పెన్షన్ కు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 141 మందికి చేరింది.