Zakir Hussain : తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత

అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

Zakir Hussain : తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. అమెరికాలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 ఏళ్లు. 1951 మార్చి 9న ముంబైలో జాకీర్ హుస్సేన్ జన్మించారు. అసమాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తబలా మ్యాస్ట్రోగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు జాకీర్ హుస్సేన్. ఆయన గుండె సంబంధ వ్యాధితో అమెరికాలోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

జాకీర్ హుస్సేన్ మృతితో భారత చలన చిత్ర రంగంలో విషాదం అలుముకుంది. జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మభూషణ్ సహా పలు అవార్డులను అందుకున్నారు. తబలా విద్వాంసుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారాయన. 11 ఏళ్ల వయసులోనే అమెరికాలో తొలి సంగీత కచేరి ఇచ్చారు. తన వంటింట్లోని పాత్రలతోనూ మ్యూజిక్ వాయించే వారు. తన కెరీర్ లో అత్యున్నత పౌర పురస్కారాలతో పాటు అనేక అవార్డులను అందుకున్నారు.