Annamalai: చొక్కావిప్పి కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. వీడియో వైరల్

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చొక్కా విప్పి కొరడాతో ఆరు దెబ్బలు కొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tamil Nadu BJP president K Annamalai

Tamil Nadu BJP president Annamalai: తమిళనాడులో డీఎంకే ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కొరడా దెబ్బలు కొట్టుకున్నాడు. అన్నా యూనివర్శిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో న్యాయం చేయాలంటూ వినూత్న నిరసన తెలియజేశారు. చొక్కావిప్పి స్వయంగా కొరడా తీసుకొని తన ఒంటిపై ఆరు కొరడా దెబ్బలను అన్నామలై కొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Manmohan Singh: మన్మోహన్ సింగ్ తన ఆఖరి ప్రెస్‌మీట్‌లో అలా ఎందుకన్నారు..?

తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారం కోల్పోయే వరకు చెప్పులు ధరించబోనని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పంతం పట్టిన విషయం తెలిసిందే. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు 48రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తానని అన్నారు. చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా యూనివర్శిటీ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన అన్నామలై అధికార పార్టీపైన నిప్పులు చెరిగారు. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు ఎలా లీక్ చేస్తారని మండిపడ్డారు. బాధితుల మనోభావాలు మరింత దెబ్బతినేలా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.

Also Read: Manmohan Singh: ఒరాక్ ఒబామా తాను రాసిన పుస్తకంలో మన్మోహన్ సింగ్ గురించి ఏమన్నారో తెలుసా?

లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న జ్ఞానశేఖరన్ పైన రౌడీషీట్ ఎందుకు తెరవలేదని పోలీసులను ప్రశ్నించారు. డీఎంకేతో నిందితుడికి సంబంధాలే అందుకు కారణమని ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నామలై మండిపడ్డారు. ఇదిలాఉంటే.. విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే నిందితుడు జ్ఞానశేఖరన్ పై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్ ల కాపీలు, అటువంటి కేసులలో తీసుకున్న చర్యల వివరాలను పంపాలని కమిషన్ డీజీపీని కోరింది.