Kerala: కేంద్ర విద్యావిధానం ‘కాషాయం’ అంటూ మండిపడ్డ తమిళనాడు సీఎం స్టాలిన్

వామపక్షాలు, డీఎంకే సిద్ధాంతాలు వేరైనా మతతత్వంపై పోరులో ఒకటేనని అన్నారు. వామపక్షాలు, డీఎంకే పార్టీల పరంగా వేర్వేరు సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ మతతత్త్వవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలనీ, కార్మికులు, సామాన్యులు అభివృద్ధి కోసం పాటుపడుతున్న పార్టీలని చెబుతూ తమ పార్టీ జెండాలో, కమ్యూనిస్టు పార్టీల జెండాలోనూ ఎరుపు రంగు ఉందన్న విషయాన్ని ఎవరూ మరువకూడదని చెప్పారు.

Kerala: మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యావిధానంపై తమిళానాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నూతన విద్యావిధానం పేరిట దేశంలో కాషాయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు, హిందీ భాషను నిర్బంధంగా అమలు చేసేందుకు చట్టం ముసుగులో కుట్రపన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు.

కేరళ రాజధాని తిరువనంతపురంలో సీపీఐ రాష్ట్రస్థాయి మహానాడు సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రాల హక్కులన్నీ వరుసగా హరించుకుపోతున్నాయని, నీట్‌ ప్రవేశపెట్టి గ్రామీణ తమిళ యువకులకు వైద్య విద్యను దూరం చేసిందని, జీఎస్టీని అమలు చేసి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అధ్వాన్నంగా మార్చిందని, పథకాల అమలుకు నిధుల కోసం కేంద్రం వద్ద చేతులు చాచాల్సి అగత్యం ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TRS Or BRS: టీఆర్ఎస్ కాదు.. ఇకపై బీఆర్ఎస్! దసరా రోజే ప్రకటన.. ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్

డీఎంకే మొదటి నుంచి రాష్ట్రాల స్వయం సమృద్ధి ప్రధాన లక్ష్యంగానే పోరాడుతోందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా ద్వంద్వపాలను చేయించి, నిధులు విడుదల చేయకుండా రాష్ట్రాల స్థాయిని మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చుతోందని స్టాలిన్‌ ఘాటుగా విమర్శించారు.

ఇక ఈ కార్యక్రమంలో ఆయన ‘ఫెడరలిజమ్‌- కేంద్ర రాష్ట్ర సంబంధాలు’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా వామపక్షాలు, డీఎంకే సిద్ధాంతాలు వేరైనా మతతత్వంపై పోరులో ఒకటేనని అన్నారు. వామపక్షాలు, డీఎంకే పార్టీల పరంగా వేర్వేరు సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ మతతత్త్వవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలనీ, కార్మికులు, సామాన్యులు అభివృద్ధి కోసం పాటుపడుతున్న పార్టీలని చెబుతూ తమ పార్టీ జెండాలో, కమ్యూనిస్టు పార్టీల జెండాలోనూ ఎరుపు రంగు ఉందన్న విషయాన్ని ఎవరూ మరువకూడదని చెప్పారు.

Stranger Attacked Kejriwal : గుజరాత్‌లో కేజ్రీవాల్‌ పై వాటర్‌ బాటిల్‌తో దాడి

ట్రెండింగ్ వార్తలు