Tamilnadu : ఈ పెళ్లి.. చాలా వెరైటీ గురూ, ఇలాంటి వేడుక ఇండియాలోనే జరగలేదు!

తమిళనాడులో మెటావర్స్ రిసెప్షన్‌తో.. ఈ జంట అద్భుతమైన ఫీట్ సాధించబోతోంది. శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్‌, జనగనందిని వివాహం.. వచ్చే నెల 6న జరగనుంది.

Metavarse

Tamilnadu Wedding Reception In Metaverse : వచ్చే నెల 6న.. తమిళనాడులో ఓ వెడ్డింగ్ రిసెప్షన్ జరగబోతోంది. అలాంటి వేడుక.. ఇప్పటివరకు ఇండియాలో జరగనేలేదు. ఇండియన్స్ ఎవరూ చూడనేలేదు. ఎందుకంటే.. ఆ రిసెప్షన్.. మెటావర్స్‌లో జరగబోతోంది. వినడానికి వింతగా ఉందా? చూసేందుకు ఇంకా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు.. దేశం మొత్తం.. ఇదే హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులో మెటావర్స్ రిసెప్షన్‌తో.. ఈ జంట అద్భుతమైన ఫీట్ సాధించబోతోంది. శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్‌, జనగనందిని వివాహం.. వచ్చే నెల 6న జరగనుంది.

Read More : KTR : బడ్జెట్‌లో నిధులివ్వండి, నిర్మలా సీతారామన్‌కి కేటీఆర్ లేఖ

అక్కడున్న ఆంక్షల వల్ల.. కొద్ది మంది బంధువుల సమక్షంలోనే వేడుక కానిచ్చేస్తారు. అయితే రిసెప్షన్‌ మాత్రం వర్చువల్‌గా నిర్వహించబోతున్నారు. అదే.. మెటావర్స్‌ ద్వారా. ఇది గనక సక్సెస్‌ అయితే.. ఇండియాలో ఈ తరహా ప్రయోగం చేసిన మొదటి జంట వీళ్లదే అవుతుంది. దినేశ్‌ ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌గా పని చేస్తున్నాడు. జగనందిని సాప్ట్‌వేర్‌ డెవలపర్‌గా పని చేస్తోంది. ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం అయ్యారు. ప్రేమలో పడి.. పెద్దలను వివాహానికి ఒప్పించారు.

Read More : Shahjahanpur : నిద్ర వస్తోంది.. ట్రైన్ నడుపలేనన్న డ్రైవర్

ఇండియాలో.. ఫస్ట్ మెటావర్స్ మ్యారేజ్ తమదేనని దినేష్.. ఈ వీడియో రిలీజ్ చేశాడు. హ్యరీ పోటర్ యూనివర్స్ థీమ్‌తో.. రిసెప్షన్ నిర్వహించబోతున్నారు. గంటపాటు జరిగే ఈ ఈవెంట్‌కి.. గెస్ట్ లంతా డిజిటవల్ అవతార్స్‌తో అటెండ్ అవుతారు. గిఫ్ట్‌ల కింద క్రిప్టో కరెన్సీని ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంది. అసలు మెటావర్స్ అంటే.. వర్చువల్ రియాలిటీ వరల్డ్. అసలైన రూపాలతో కాకుండా.. డిజిటల్ అవతార్‌లతో.. ఆన్‌లైన్‌లో ఇంటరాక్ట్ అవడం. అగుమెంటెడ్‌ రియాలిటీ, బ్లాక్‌ చెయిన్‌, వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీల కలయికగా చెప్పొచ్చు.