ADR analysis : పదేళ్లలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఆస్తులు ఎంత పెరిగాయో తెలుసా..? మూడో స్థానంలో వైసీపీ ఎంపీ..

ADR analysis : దేశ వ్యాప్తంగా వరుసగా మూడు సార్లు (2014 ఎన్నికల నుంచి 2024 ఎన్నికలు) ఎంపీలుగా గెలిచిన 102 మంది తమ అఫిడవిట్‌లో పొందుపర్చిన ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.

ADR analysis : పదేళ్లలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఆస్తులు ఎంత పెరిగాయో తెలుసా..? మూడో స్థానంలో వైసీపీ ఎంపీ..

Narendra Modi Rahul Gandhi

Updated On : January 8, 2026 / 10:16 AM IST
  • వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచిన వారి ఆస్తులను విశ్లేషించిన ఏడీఆర్
  • పదేళ్లలో అత్యధికంగా ఆస్తులు పెరిగిన ఎంపీల్లో టాప్-10లో ఐదుగురు బీజేపీవారే
  • మొదటి స్థానంలో నిలిచిన సతారా ఎంపీ ప్రతాప్ సిన్హా మహరాజ్
  • మూడో స్థానంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

ADR analysis : దేశ వ్యాప్తంగా వరుసగా మూడు సార్లు (2014 ఎన్నికల నుంచి 2024 ఎన్నికలు) ఎంపీలుగా గెలిచిన 102 మంది తమ అఫిడవిట్‌లో పొందుపర్చిన ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. వీరి ఆస్తులు 2014లో సరాసరిగా రూ.15.78 కోట్లుగా ఉంటే.. 2024 నాటికి 110 శాతం వృద్ధితో రూ.33.13 కోట్లకు పెరిగాయి. ఈ మూడేళ్లలో భారీగా ఆస్తులు పెరిగిన జాబితాలో మహారాష్ట్రంలోని సతారా ఎంపీ ప్రతాప్ సిన్హా మహరాజ్ మొదటి స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు.

Also Read : Telangana : తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం.. కానీ, 19రోజులే..!

యూపీలోని వారణాసి నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.3,02,06,889గా తేలింది. 2014లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.1.65 కోట్లుగా ప్రకటించారు. పదేళ్లలో మోదీ ఆస్తుల విలువ సుమారు రూ.1.36కోట్లు పెరిగింది. అంటే 82శాతం పెరిగిందని ఏడీఆర్ సంస్థ పేర్కొంది.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు దాదాపు రూ.11కోట్లు (117శాతం) పెరిగాయి. ఎంపీల జాబితాలో ఆయన 38వ స్థానంలో ఉన్నారు. 2014లో రాయ్‌‌బరేలీ నుంచి ఎంపీగా బరిలోకి దిగినప్పుడు రాహుల్ గాంధీ ఆస్తుల విలువ రూ.9.40 కోట్లు.. 2024లో అమేథి నుంచి పోటీకి దిగినప్పుడు రూ.20.39 కోట్లుగా అఫిడవిట్ లో చూపించారు.

ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన ప్రతాప్ సిన్హా మహరాజ్ ఆస్తి 2014లో రూ.60.60కోట్లు కాగా.. 2024నాటి అఫిడవిట్‌లో తన ఆస్తిని రూ.223.12 కోట్లుగా చూపించారు. రెండో స్థానంలో గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్ బీజేపీ ఎంపీ పూనంబెన్ హేమంత్ భాయ్ ఉన్నారు. 2014లో ఆమె ఆస్తి రూ.17.42 కోట్లు కాగా.. 2024నాటి అఫిడవిట్‌లో రూ.147.70 కోట్లుగా పేర్కొన్నారు. పదేళ్లలో ఆమె ఆస్తుల విలువ రూ.130 కోట్లు పెరిగింది.

ఇక మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిలిచారు. 2014 అఫిడవిట్‌లో ఆయన ఆస్తి విలువ రూ.22 కోట్లుగా పేర్కొన్నారు. 2024లో రూ.146కోట్లుగా చూపించారు. పదేళ్లలో మిథున్ రెడ్డి రూ.124కోట్లు పెరిగాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఆస్తులు పదేండ్లలో రూ.19కోట్లు పెరిగాయి. టీడీపీ తరపున గత మూడు ఎన్నిలక్లో గెలిచిన ఏకైక ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆస్తులు పదేళ్లలో 117శాతం పెరిగాయి. పెరుగుదల పరంగా ఆయన 28వ స్థానంలో ఉన్నారు. వైసీపీ నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఆస్తుల విలువ వృద్ధిపరంగా 15వ స్థానంలో నిలిచారు.