TATA Air India 500 flights Purchase
TATA Air India 500 flights Purchase : ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ దాన్ని మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. దీని కోసం భారీ సంఖ్యలో విమానాలను కొనుగోలు చేయనుంది. సుమారు 500ల జెట్ లైనర్ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించిది. రూ.80 వేల కోట్లను ఖర్చుతో బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేయనుంది.
TATA BISLERI : దూకుడుమీదున్న TATA .. బిస్లెరీ కొనుగోలుకు రంగం సిద్ధం
కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలు తక్కువ సీటింగ్ కలిగిన విమానాలు కాగా..మరో 100 విమానాలు భారీ విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ భారీ విమానాల్లో ఎయిర్ బస్ కు చెందిన A350 విమానాలతో బోయింగ్ సంస్థకు చెందిన 787, 777 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ భారీ కొనుగోలు ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాల్చనుందని విమానయాన రంగం వర్గాలు తెలిపాయి. ఈ కొనుగోలుకు సంబంధించి ఎయిరిండియా నుంచి అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా సమాచారం.
TATA : బడా వ్యాపారాలపై TATA ఫోకస్.. పలు కంపెనీల్లో భారీ పెట్టుబడులు..