Broken footpaths: పాదచారులకు ఇబ్బందులు కలగకుండా ఫుట్‌పాత్‌లను కడతారు. దానిపై ఏ సమస్యా లేకుండా హాయిగా నడుచుకుంటూ పోవచ్చు. అయితే, బెంగళూరులోని ఓ ప్రాంతంలో మాత్రం ఫుట్‌పాత్‌పై నడవాలంటేనే జనాలు భయపడిపోతున్నారు.
వాహనాలు తిరిగే రోడ్డుపై నడవలేమని, ఫుట్‌పాత్‌లపై నడుద్దామంటే అవి పాడైపోయి ఉన్నాయని అంటున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి యోగీష్ ప్రభుస్వామి గాంధీ (41) పోస్ట్ చేస్తూ ఈ ఫుట్‌పాత్‌పై నడవడమంటే సాహస క్రీడల్లో పాల్గొనడమేనని చెప్పాడు.
బెంగళూరులోని ఫోరమ్ సౌత్ మాల్ సమీపంలోని కోననకుంటె బస్టాప్‌లో ఫుట్‌పాత్‌పై నుంచి నడుస్తూ వెళ్లి బస్సు ఎక్కే ప్రయత్నంలో పడిపోబోయానని తెలిపాడు. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని, తెలుపుతూ అక్కడి పరిస్థితులను వివరించాడు.
ఈ ఫుట్‌పాత్‌లపై నడవాలంటే బ్యాలెన్స్ తప్పి పడిపోకుండా నడిచే స్కిల్ ఉండాలని పేర్కొన్నాడు. ఫుట్‌పాత్‌పై నడిచి రోడ్డు మీదకు దూకే సత్తా కూడా ఉండాలని ఎద్దేవా చేశాడు. కొందరు ప్రయాణికులు చాలా కష్టంగా ఆ ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు ఈ వీడియోలో కనపడ్డాయి.
Walking in Bengaluru is an extreme sports. Need the skill to balance on tiny concrete strip and to jump from footpath to road!
No, I didn’t dare take this bus!
Just one slip and a lifetime injury – that’s how pedestrians are treated in the so-called “Infra Era”! #NadeyaluBidi pic.twitter.com/BGUztE8Y8m
— Yogeesh Prabhuswamy (@yogeeshgp) September 30, 2024
>నెల్లూరులో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్.. అసలేం జరిగిందంటే..