నెల్లూరులో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్.. అసలేం జరిగిందంటే..
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఆత్మీయ సభ పేరుతో జరిగే సమావేశానికి ఆహ్వానం.. అంటూ వైసీపీ నాయకులు..

Flexi War : నెల్లూరులో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. నగరంలోని చింతారెడ్డిపాలెం కూడలిలో అభిమానులు పవన్ కల్యాణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్ ను అధికారులు తొలగిస్తుండటంతో జనసేన కార్యకర్తలు తిరగబడ్డారు. నెల్లూరు జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఆమె భర్త విజయ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీల కోసమే పవన్ కల్యాణ్ కటౌట్లు తీయడంతో జనసేన కార్యకర్తలు, నేతలు అడ్డుకున్నారు.
Also Read : పవన్ కల్యాణ్.. అదొక పెద్ద క్రైమ్, జాగ్రత్తగా ఉండండి..!- హర్షకుమార్ వార్నింగ్
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఆత్మీయ సభ పేరుతో జరిగే సమావేశానికి ఆహ్వానం.. అంటూ వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను తొలగించి వైసీపీ నాయకుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి జనసేన నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి అరుణమ్మ, ఆమె భర్త విజయ్ కుమార్ ఫ్లెక్సీలను జనసేన కార్యకర్తలు తీయించడంతో వివాదం సద్దుమణిగింది.