ఆర్జేడీ నేత సెటైర్స్ : బట్టతల ఉన్నవారికి దువ్వెనలు అమ్మిన మోడీ

  • Publish Date - February 4, 2019 / 06:34 AM IST

పాట్నా : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీయాదవ్ సెటైర్లు విసిరారు. బట్టతల ఉన్న వారికి దువ్వెనలు అమ్మిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదేననీ..బీజేపీ అధికారంలోకి రాగానే బట్టతలపై జుట్టు తెప్పిస్తామని చెప్పి దువ్వెనలు అమ్మిన మోదీ మంచి సేల్స్ మెన్ అని సెటైర్లు విసిరారు.పాట్నాలో కాంగ్రెస్ పార్టీ జన్ ఆక్రోశ్ ర్యాలీ కార్యక్రమంలో రాహుల్ గాంధీ తో పాటు తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్న సందర్భంగా తేజస్వీ యాదవ్ ఈ సెటైర్లు వేశారు.
 

 
రానున్న ఎన్నికల్లోఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకే మహాకూటమిగా ఏర్పడి పోరాడుతున్నామని..2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. దేశంలో 2014 నాటి పరిస్థితులు లేవనీ..ఇప్పుడు అంతటా బీజేపీ వ్యతిరేకత కొనసాగుతోందనీ..ఈ పరిస్థితుల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే సమస్యే లేదనీ..తేజస్వీ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ మాటల్నీ ప్రజలు నమ్మటంలేదనీ..మోడీ అసలు రంగు  బీహార్ నిరుద్యోగులకు తెలియజెప్పేందుకే రాహుల్ ఈ ర్యాలీలో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు.