Tejasvi Surya 'unconditionally Withdraws' His 'hindu Revival' Remarks
Tejasvi Surya : దేశంలో మతాన్ని వారిపట్ల తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నానని బెంగళూరు భారతీయ జనతా పార్టీ ఎంపీ, బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ప్రకటించారు. ఇటీవల ఉడిపిలో జరిగిన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు తేజస్వీ సూర్య ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఉడుపి శ్రీకృష్ణ మఠంలో ‘భారత్‌లో హిందూ పునరుజ్జీవనం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన తేజశ్వీ సూర్య.. హిందూ మతం నుంచి బయటకు వెళ్లిన వారందరినీ తిరిగి రావాలని కోరారు. మాతృమతాన్ని విడిచిపెట్టిన వారికి మళ్లీ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాల రీత్యా కొందరు హిందువులు మతం మారారని, వారందరిని తిరిగి హిందూమతంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ విషయంలో అన్ని మఠాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని తేజస్వీ సూర్య వ్యాఖ్యానించారు. అయితే తన ప్రసంగంలోని మాటలు వివాదాస్పదంగా మారాయని చెప్పారు. అందుకే ఇప్పుడు ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను’ అని సూర్య ట్వీట్ చేశారు.
Read Also : Omicron In America : అమెరికాను వణికిస్తున్న ఒమిక్రాన్.. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే..!