Omicron In America : అమెరికాను వణికిస్తున్న ఒమిక్రాన్.. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే..!

కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరే 18 ఏళ్లలోపు వారి సంఖ్య ఇటీవల నాలుగు రెట్లు పెరిగినట్టు న్యూయార్క్‌ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆందోళన వ్యక్తం చేసింది.

Omicron In America : అమెరికాను వణికిస్తున్న ఒమిక్రాన్.. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే..!

Omicron

Omicron cases heavily reported in America : అమెరికాలో ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది..! ముఖ్యంగా న్యూయార్క్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి..! కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరే చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని స్థాయిలో చిన్నారుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. వీళ్లలో చాలా మంది ఒమిక్రాన్ వేరియంట్ బాధితులే.

కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరే 18 ఏళ్లలోపు వారి సంఖ్య ఇటీవల నాలుగు రెట్లు పెరిగినట్టు న్యూయార్క్‌ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో వారం రోజులుగా రోజుకు సగటున లక్షా 90 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో న్యూయార్క్‌లో ఆస్పత్రిలో చేరుతున్న వారిలో 5యేళ్ల లోపు చిన్నారులే ఎక్కువ మంది ఉండటం వైద్యులను కంగారు పెట్టిస్తోంది.
CM Jagan : ఏపీ వైద్యారోగ్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

ఒమిక్రాన్ కారణంగా అమెరికాలో మళ్లీ మొదటి వేవ్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని అమెరికా వైరాలజిస్టు, ప్రభుత్వ సలహాదారు ఆంటోనీ ఫౌసీ ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్‌ ప్రమాదకరం కాకపోయినా… వేగంగా వ్యాపిస్తున్న తీరు.. ప్రభుత్వాన్ని, వైద్యులను కలవరపెడుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఒక్కసారిగా కేసులు పెరగడం, ఆస్పత్రులకు బాధితులు పోటెత్తడంతో అమెరికా వైద్య వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది.

చిన్నపిల్లలు కూడా ఒమిక్రాన్ బారిన పడుతుండటంతో తమ చిన్నారులకు ఏమైపోతుందో అన్న ఆందోళనలతో తల్లిదండ్రులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అమెరికాలో ఐదేళ్ల పైబడి చిన్నారులందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే కోవిడ్‌తో న్యూయార్క్‌ ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల్లో ఎక్కువ మంది ఐదేళ్ల లోపు చిన్నారులే ఉన్నారు…

Musi River : మూసీ కొత్త అందాలు..నదిపై వంతెనలు, అందమైన గార్డెన్లు, బోటింగ్

మరోవైపు క్రిస్మస్ హాలిడే సీజన్ కావడంతో అమెరికాలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా కోవిడ్ పరీక్షను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. దీంతో కోవిడ్ టెస్ట్ కోసం వేలాది మంది ల్యాబ్‌ల ముందు క్యూ కడుతున్నారు. ఒక్కసారిగా కోవిడ్ టెస్టుల కోసం డిమాండ్ పెరగడంతో టెస్టింగ్ కిట్స్ కొరత ఏర్పడింది. బైడెన్ ప్రభుత్వం టెస్టింగ్ కిట్స్ కొరతను తీరుస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో సమస్య అలాగే ఉంది. మరో నెల రోజుల వ్యవధిలోనే ఈ సమస్యను అధిగమిస్తామని.. ఫౌసీ చెబుతున్నారు.