Odisha : ఒడిశాలో పిడుగుపాటుకు 10 మంది మృతి

ఒడిశా రాష్ట్రంలో పిడుగుల పాటుకు 10మంది మరణించారు. ఒడిశా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటుకు 10మంది మరణించారని అధికారులు చెప్పారు. జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది....

Lightning Strikes In Odisha

Odisha : ఒడిశా రాష్ట్రంలో పిడుగుల పాటుకు 10మంది మరణించారు. ఒడిశా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటుకు 10మంది మరణించారని అధికారులు చెప్పారు. జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ( Lightning Strikes In Odisha) పిడుగుపాటుకు ఖుర్దా జిల్లాలో నలుగురు, బోలంగీర్‌లో ఇద్దరు, అంగుల్, బౌధ్, జగత్‌సింగ్‌పూర్,ధెంకనల్‌లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని ఒడిశా ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. (Ten Killed) పిడుగుపాటుకు ఖుర్దాలో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారని కమిషనర్ కార్యాలయం పేర్కొంది.

Kesineni Nani : విజయవాడ నాదే.. మరోసారి కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

రానున్న నాలుగు రోజుల్లో ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. తుపాన్ ప్రభావం వల్ల భారీవర్షాలు కురుస్తున్నాయి. భువనేశ్వర్, కటక్ నగరాల్లో కేవలం 90 నిమిషాల సమయంలో 126 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురిసిందని ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఎక్స్ లో తెలిపింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

IND vs PAK : వ‌రుణుడి ఆట‌.. మ్యాచ్ ర‌ద్దు.. భార‌త్‌, పాకిస్తాన్‌కు చెరో పాయింట్‌

ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. సెప్టెంబర్ 3వతేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఇక్కడి ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ హెచ్‌ఆర్ బిశ్వాస్ తెలిపారు. ఈ వాయుగుండం ప్రభావంతో తదుపరి 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని బిశ్వాస్ వివరించారు.