Terror Funding Case : యాసిన్ మాలిక్‌కి జీవిత ఖైదు విధించిన ఎన్ఐఏ కోర్ట్

Terror Funding Case :  జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో వేర్పాటు వాద నాయకుడు యాసిన్ మాలిక్ కు పాటియాలా హౌస్  ఎన్ఐఏ ప్రత్యే కోర్టు శిక్ష ఖరారు చేసింది. వివిధ కేసులలో  నేరాలు రుజువు అవటంతో రెండు జీవిత ఖైదులు, 10 నేరాలలో కఠిన కారాగార శిక్ష మరియు 10 లక్షల రూపాయల జరిమనా విధించింది. కాగా యాసిన్ మాలిక్ కు మరణ శిక్ష విధించాలని ఎన్ఐఏ వాదించింది.

యాసిన్ మాలిక్ పై ఉపా యాక్ట్ కింద 7 ఆరోపణలు ఉన్నాయి. అవి
సెక్షన్ 120 బి ఐపిసి కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, 10వేలు జరిమానా.
సెక్షన్ 121A కింద 10 సంవత్సరాలు 10వేల జరిమానా
సెక్షన్ 13 UAPA చట్టం కింద 5 సంవత్సరాల జైలు శిక్ష
సెక్షన్ 15UAPA చట్టం కింద 10 సంవత్సరాల జైలు శిక్ష
సెక్షన్ 17UAPA చట్టం కింద జీవిత ఖైదు 10 లక్షల జరిమానా
సెక్షన్ 18UAPA చట్టం కింద 10 సంవత్సరాల జైలు శిక్ష 10వేలు జరిమానా
సెక్షన్ 20UAPA చట్టం కింద 10 సంవత్సరాల జైలు శిక్ష 10వేలు జరిమానా
సెక్షన్ 38, 39 UAPA కింద 5 సంవత్సరాల జైలు శిక్ష 5వేలు జరిమానా విధించారు.

కాగా యాసిన్ మాలిక్ కు శిక్ష ఖరారు చేయటంతో కాశ్నీర్ లో పలు చోట్ల ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనకారులు రాళ్లదాడికి పాల్పడ్డారు. యాసిన్ మాలిక్ ను తీహార్ జైలుకు తరలించారు.

ట్రెండింగ్ వార్తలు