Pakistan Terrorist: భారత్‌లో ఆత్మాహుతి దాడుల కోసం పాకిస్థాన్ నాకు రూ.30 వేలు ఇచ్చింది: భారత ఆర్మీకి చెప్పిన ఉగ్రవాది

భారత్‌లో దాడులకు పాకిస్థాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. తాజాగా, ఓ కుట్రను ఛేదించిన భద్రతా బలగాలు ఉగ్రవాది నుంచి పలు వివరాలు రాబట్టారు. జమ్మూకశ్మీర్ లోని రాజౌరీలో సరిహద్దు వద్ద ఇటీవల తబారక్ హుస్సేన్ అనే ఉగ్రవాదిని భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అతడిని విచారించగా పలు వివరాలు చెప్పాడు. భారత్ లో ఆత్మహుతి దాడి మిషన్ కోసం తాను చొరబడడానికి ప్రయత్నించానని అన్నాడు. పాకిస్థాన్ ఆర్మీ కల్నల్ యూనస్ తనను పంపాడని, ఖర్చుల కోసం తనకు రూ.30,000 ఇచ్చాడని చెప్పాడు.

Pakistan Terrorist: భారత్‌లో దాడులకు పాకిస్థాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. తాజాగా, ఓ కుట్రను ఛేదించిన భద్రతా బలగాలు ఉగ్రవాది నుంచి పలు వివరాలు రాబట్టారు. జమ్మూకశ్మీర్ లోని రాజౌరీలో సరిహద్దు వద్ద ఇటీవల తబారక్ హుస్సేన్ అనే ఉగ్రవాదిని భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అతడిని విచారించగా పలు వివరాలు చెప్పాడు. భారత్ లో ఆత్మహుతి దాడి మిషన్ కోసం తాను చొరబడడానికి ప్రయత్నించానని అన్నాడు. పాకిస్థాన్ ఆర్మీ కల్నల్ యూనస్ తనను పంపాడని, ఖర్చుల కోసం తనకు రూ.30,000 ఇచ్చాడని చెప్పాడు.

ఈ ఆత్మాహుతి దాడి మిషన్ కోసం తనతో పాటు మరో ముగ్గురిని నియమించారని తెలిపాడు. అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోంది. కాగా, రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్ లో నాలుగు రోజుల క్రితం 48 గంటల వ్యవధిలో భారత ఆర్మీ రెండు సార్లు చొరబాట్లను అడ్డుకుంది. వారిలో ఒక ఉగ్రవాది సరిహద్దులోని ఫెన్సింగ్ ను కట్ చేసే ప్రయత్నం చేశాడని అధికారులు చెప్పారు. అతడిని భారత ఆర్మీ హతమార్చిందని వివరించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చొరబాట్లపై భారత ఆర్మీ నిఘా ఉంచి ఎప్పటికప్పుడు కుట్రలను భగ్నం చేస్తోంది.

Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో 12 మందికి తీవ్రగాయాలు

ట్రెండింగ్ వార్తలు