Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో 12 మందికి తీవ్రగాయాలు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లాలోని శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు ఢీ కొన్నాయి. ఈ ​ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని తుమకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు వారికి చికిత్స అందిస్తున్నారు.

Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో 12 మందికి తీవ్రగాయాలు

Accident in Karnataka

Updated On : August 25, 2022 / 9:02 AM IST

Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లాలోని శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు ఢీ కొన్నాయి. ఈ ​ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని తుమకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు వారికి చికిత్స అందిస్తున్నారు. గత అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో క్రూయిజర్​ జీపులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Ganesh Chaturthi-2022: హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల ధరలు భారీగా పెరిగిపోయిన వైనం.. ఎందుకంటే..?