Ganesh Chaturthi-2022: హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల ధరలు భారీగా పెరిగిపోయిన వైనం.. ఎందుకంటే..?

ఈ సారి ధరలు గత ఏడాది కంటే దాదాపు 40 శాతం పెరిగాయని మీడియాకు హైదరాబాద్ లోని గణేశ్ విగ్రహాల తయారీదారుడు ఒకరు తెలిపారు. ఈ సారి విగ్రహాలను తక్కువ తయారు చేశామని అన్నారు. కరోనా కారణంగా గత రెండు ఏళ్ళుగా గణేశుడి విగ్రహాల అమ్మకాలు తగ్గాయి. అయితే, ఈ సారి మాత్రం వినాయకుడి భక్తుల నుంచి భారీగా డిమాండ్ ఉందని గణేశ్ విగ్రహాల తయారీదారుడు తెలిపారు.

Ganesh Chaturthi-2022: హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల ధరలు భారీగా పెరిగిపోయిన వైనం.. ఎందుకంటే..?

Ganesh Chaturthi-2022

Ganesh Chaturthi-2022: హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. 11 రోజుల పాటు నగరం అంతా సందడి నెలకొంటుంది. వినాయక చవితి రోజున హైదరాబాద్ లో గణేశుడి విగ్రహాలకు బాగా డిమాండ్ ఉంటుంది. అయితే, ఈ సారి డిమాండుకు తగ్గ గణేశుడి విగ్రహాలు హైదరాబాద్ లో తయారు కాలేదు. దీంతో ధరలు బాగా పెరిగిపోయాయి. గణేశుడి విగ్రహాలను ముందస్తుగా కొనుగోలు చేసేందుకు వెళ్తున్న నగరవాసులు అక్కడి ధరలు చూసి షాక్ అవుతున్నారు.

ఈ సారి ధరలు గత ఏడాది కంటే దాదాపు 40 శాతం పెరిగాయని మీడియాకు హైదరాబాద్ లోని గణేశ్ విగ్రహాల తయారీదారుడు ఒకరు తెలిపారు. ఈ సారి విగ్రహాలను తక్కువ తయారు చేశామని అన్నారు. కరోనా కారణంగా గత రెండు ఏళ్ళుగా గణేశుడి విగ్రహాల అమ్మకాలు తగ్గాయి. అయితే, ఈ సారి మాత్రం వినాయకుడి భక్తుల నుంచి భారీగా డిమాండ్ ఉందని గణేశ్ విగ్రహాల తయారీదారుడు తెలిపారు.

వినాయక చవితికి మరో వారం రోజులు ఉండగానే ఇప్పటికే భక్తులు భారీగా వచ్చి కొనుగోళ్ళు చేస్తున్నారు. డిమాండ్ ఇంతగా ఉంటుందని విగ్రహాల తయారీదారులు ఊహించలేదు. డిమాండ్ అధికంగా ఉండడంతో ధరలు కూడా భారీగా పెరిగాయి.

Pakistan on Raja Singh’s remarks: రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం