Srinagar
Terrorists జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాత శ్రీనగర్ టౌన్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో పోలీస్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఖన్యార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ప్రొబేషనరీ సబ్ ఇన్స్‌స్పెక్టర్ అర్షిద్ అహ్మద్ కు గాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసును.. స్థానిక ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారని అధికారులు తెలిపారు.
కాల్పుల జరిపిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు