Jammu and Kashmir : కశ్మీరులో ఆశ్రయం కల్పించలేదని ఉగ్రవాదులు ఏం చేశారంటే…

జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. తమకు ఆశ్రయం కల్పించేందుకు నిరాకరించిన కాశ్మీరీ యువకుడిని ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన సంచలనం రేపింది....

Kashmiri Boy

Jammu and Kashmir : జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. తమకు ఆశ్రయం కల్పించేందుకు నిరాకరించిన కాశ్మీరీ యువకుడిని ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన సంచలనం రేపింది. ఈ సంఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఓ యువకుడు తన ఇంట్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులను అడ్డుకున్నాడు. దీంతో ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపారు. ఈ హత్య అనంతనాగ్ ప్రాంతంలోని నివాసితుల్లో ఆగ్రహం రేకెత్తించింది. అనంత్‌నాగ్‌లోని వెటర్‌గామ్ ద్యాల్‌గామ్ ప్రాంతంలో యువకుడు సాహిల్ బషీర్ దార్‌ను అతని నివాసం వెలుపల గుర్తు తెలియని ఉగ్రవాదులు కాల్చి చంపారు.

Also Read : New COVID-19 Wave : సింగపూర్‌లో కొత్త కొవిడ్-19 వైరస్ వ్యాప్తి

కొంతమంది తన ఇంట్లోకి ప్రవేశించారని, వారిని చూసి తన తల్లి ఇంట్లో దొంగలు పడ్డారని కేకలు వేసిందని సాహిల్ సోదరి తెలిపారు. తాము దొంగలు కాదు అని కాశ్మీరీలో సమాధానం ఇచ్చారు. ఈలోగా సాహిల్ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని పట్టుకున్నాడు. ‘‘నేను సాహిల్‌ని వదిలేయమని అడుగుతుండగా, మరో వ్యక్తి అతని పిస్టల్ తీసి నా సోదరుడి మెడపై కాల్చాడు. ఇద్దరూ చొరబాటుదారులు పారిపోయారు. మా సహాయం కోసం ఎవరూ రాకుండా రెండుసార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. మా నాన్న అక్కడ ప్రార్థనలు చేస్తున్నప్పుడు నేను మసీదు తలుపు తట్టాను, మేం సాహిల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాం’’ అని మృతుడి సోదరి చెప్పింది.

Also Read : Plane Crash : ఆస్ట్రేలియాలో కూలిన తేలికపాటి విమానం..నలుగురి మృతి

కుటుంబ సభ్యులు అతన్ని అనంతనాగ్‌లోని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ నుంచి ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్ ట్రామా హాస్పిటల్ స్కిమ్స్‌కు రిఫర్ చేశారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, గాయపడిన యువకుడు గురువారం రాత్రి మృతి చెందాడు. కాశ్మీర్‌ ప్రజలు ఎంతకాలం ఇలా కష్టాలు అనుభవించాలని సాహిల్‌ సోదరి ప్రశ్నించారు. ఈ దారుణ ఘటనపై తాము దర్యాప్తు ప్రారంభించామని, అమాయక యువకుడి హత్యకు కారణమైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు ప్రారంభించామని కశ్మీర్ పోలీసు అధికారులు తెలిపారు.