Plane Crash : ఆస్ట్రేలియాలో కూలిన తేలికపాటి విమానం..నలుగురి మృతి

ఆస్ట్రేలియా దేశంలో తేలికపాటి విమానం కుప్పకూలిపోయింది. కాన్ బెర్రా నగరం నుంచి బయలుదేరిన తేలికపాటి విమానం క్వీన్ బెయాన్ పట్టణ సమీపంలో కూలిపోయింది. ప్రమాదవశాత్తూ కూలిపోయిన విమానం మంటల్లో చిక్కుకుంది.....

Plane Crash : ఆస్ట్రేలియాలో కూలిన తేలికపాటి విమానం..నలుగురి మృతి

Australia Plane Crash

Updated On : October 7, 2023 / 6:25 AM IST

Plane Crash : ఆస్ట్రేలియా దేశంలో తేలికపాటి విమానం కుప్పకూలిపోయింది. కాన్ బెర్రా నగరం నుంచి బయలుదేరిన తేలికపాటి విమానం క్వీన్ బెయాన్ పట్టణ సమీపంలో కూలిపోయింది. ప్రమాదవశాత్తూ కూలిపోయిన విమానం మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపకశాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పివేసినప్పటికీ విమానంలో ఉన్న వారు ప్రాణాలతో బయట పడలేదు. విమానంలోని పైలెట్ , ముగ్గురు పిల్లలు మరణించినట్లు ఆస్ట్రేలియా పోలీసులు చెప్పారు.

Also Read : New COVID-19 Wave : సింగపూర్‌లో కొత్త కొవిడ్-19 వైరస్ వ్యాప్తి

సిర్రస్ ఎస్ఆర్ 22 తేలికపాటి విమానం కాన్ బెర్రా నుంచి శుక్రవారం మధ్యాహ్నం బయలు దేరి సిడ్నీ నుంచి 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వీన్ బెయాన్ పట్టణ సమీపంలో కూలిపోయిందని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. కూలిపోయిన విమానం మంటల్లో చిక్కుకుంది. ఈ విమాన ప్రమాదంపై ఆస్ట్రేలియా ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విమాన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు.

Also Read : Bus crash : మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం..16 మంది మృతి, 29 మందికి గాయాలు