Dholavira UNESCO : ధోలవీరకు యునెస్కో గుర్తింపు

భారత్ కు యునెస్కో మరో శుభవార్త చెప్పింది. గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉన్న ధోలవీరకు యునెస్కో గుర్తింపు దక్కింది. గుజరాత్ లోని ధోలవీర ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది.

Dholavira UNESCO : భారత్ కు యునెస్కో మరో శుభవార్త చెప్పింది. గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉన్న ధోలవీరకు యునెస్కో గుర్తింపు దక్కింది. గుజరాత్ లోని ధోలవీర ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. హరప్ప నాగరికతకు ధోలవీర నగరం ఓ గుర్తింపుగా నిలుస్తుంది.

ధోలవీరకు వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కిన విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తన ట్విట్టర్ లో తెలిపారు. ధోలవీర ఇప్పుడు భారత్ లో 40వ వారసత్వ సంపదగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. వరల్డ్ హెరిటేజ్ సైట్లలో ఇండియా సూపర్ పార్టీ క్లబ్ లో చేరింది. ఇండియా గర్వపడాల్సిన రోజని..ముఖ్యంగా గుజరాతీ ప్రజలకు ఇది శుభ దినమని అన్నారు.

2014 నుంచి భారత్ లో కొత్తగా 10 ప్రపంచ వారసత్వ సంపదలుగా జాబితాలో చేరాయి. ఇది మొత్తం సైట్ లో నాల్గో వంతు. ప్రధాని మోడీ కమిట్ మెంట్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇక భారతీయ సంస్కృతి, పౌరసత్వం, జీవన విధానాన్ని ప్రధాని మోడీ ప్రమోట్ చేస్తున్న తీరు ఆయన దీక్షను చాటుతుందన్నారు. రెండు రోజుల క్రితమే తెలంగాణలోని రామప్ప ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో ప్రకటించింది.

హరప్పా నాగరికత నాటి పట్టణంగా ధోలవీర ప్రసిద్ధి చెందింది. 5 వేల సంవత్సరాల పూర్వం ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన నగర జీవనం ఉండేది. 1967-68లో జేపీ జోషీ నేతృత్వంలో పురావస్తు శాఖ బృందం ఈ ప్రాంతాన్ని గుర్తించింది. హరప్పా నాగరికతలోని 8 ప్రముఖ ప్రాంతాల్లో ధోలవీర ఐదో అతి పెద్దది కావడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు