Richest Lord Ganesha : ఇండియాలోనే ఖరీదైన గణపతికి రూ.360.40 కోట్ల బీమా.. ఎక్కడంటే?

ఆ వినాయకుడిని రూ.300 కోట్లు విలువైన బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. ఇండియాలోనే క్లాస్ట్లీ గణపతిగా పేరున్న ఆ గణపతికి రూ.360.40 బీమా కూడా ఉంది. ఆశ్చర్యపోతున్నారా? చదవండి.

Richest Lord Ganesha

Richest Lord Ganesha : దేశ వ్యాప్తంగా వినాయకచవితికి రకరకాల రూపాల్లో వినాయక విగ్రహాలు పెడుతుంటారు. చాలాచోట్ల ఖరీదైన విగ్రహాలు నిలబెడతారు. ఇప్పుడు చెప్పబోయే వినాయకుడు ఇండియాలోనే సంపన్నుడైన వినాయకుడట. కిలోల్లో బంగారం, వెండితో ఆభరణాలతో అలంకరించే ఈ గణపతి విగ్రహానికి రూ.360.40 బీమా ఉందంటే ఎంత రిచ్ అన్నది అర్ధం చేసుకోవచ్చు.

Khairatabad Ganesh : గణేశ్ ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణనాథుడు.. భారీ వినాయకుడి ప్రత్యేకతలు ఇవే

ముంబయి మాతుంగాలోని గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ సేవా మండల్ (GSB) వద్ద ఉన్న వినాయకుడి విగ్రహం విలువ అక్షరాల రూ.300 కోట్ల పై మాటేనట. 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో తయారు ఆభరణాలతో ఈ విగ్రహాన్ని అలంకరించారు. ఈ  విగ్రహం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. బంగారం, వెండి, రాగి, జింక్, తగరం ఈ ఐదు లోహాలతో ఆభరణాలను తయారు చేసారట. ఇవి దేశంలోనే పేరుగాంచిన నగల వ్యాపారుల ద్వారా తయారు చేయబడ్డాయట.

100 సంవత్సరాలుగా GSB సేవా మండల్ ముంబయి మాతుంగాలో గణేశ్ చతుర్థిని నిర్వహిస్తోంది. అత్యంత ధనిక గణేశ విగ్రహం ఉన్న ప్రాంతంగా ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి విగ్రహాన్ని చూడటానికి అనేకమంది తరలి వస్తుంటారు. ఈ సంవత్సరం గణేశ విగ్రహానికి రూ.360.40 కోట్ల బీమా చేసినట్లు సేవామండల్ చైర్మన్ రాఘవేంద్ర జి భట్ చెప్పారు. అయితే ఎంత సొమ్మును ప్రీమియంగా చెల్లించారన్నది ట్రస్ట్ వెల్లడించలేదు.

Ganesh Chaturthi 2023 : గణపతిని ఎందుకు నిమజ్జనం చేస్తారంటే?

రూ.360 కోట్లలో రూ.38.47 కోట్లు ఆల్ రిస్క్ ఇన్సురెన్స్ పాలనీ అని మండల ధర్మకర్త అమిత్ పాయ్ చెప్పారు. విగ్రహానికి అలంకరించే బంగారం, వెండి వస్తువులు అనేక రకాల నష్టాలను కవర్ చేస్తుందట. మరో రూ.2 కోట్లలో స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్ పాలసీ ఉంటుందట. ఇది భూకంప ప్రమాద కవర్‌ను కూడా కలిగి ఉంటుందట. భక్తుల భద్రత కోసం రూ.30 కోట్లు కేటాయించారు. 289.50 కోట్ల రూపాయల్లో అత్యధిక భాగం వాలంటీర్లు, సిబ్బందికి వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ అని అమిత్ పాయ్ చెప్పారు.