Ganesh Chaturthi 2023 : గణపతిని ఎందుకు నిమజ్జనం చేస్తారంటే?

వినాయకచవితి మొదలు 9 రోజులు విశేష పూజలందుకున్న గణపతిని నదులు, కాలువలు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. అసలు గణతిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?

Ganesh Chaturthi 2023 : గణపతిని ఎందుకు నిమజ్జనం చేస్తారంటే?

Ganesh Chaturthi 2023

Ganesh Chaturthi 2023 : గణేశ్ నవరాత్రులు పూర్తి కాగానే వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు పూజలు చేసిన విగ్రహాన్ని ఇలా నిమజ్జనం చేయడం ఎందుకు? గణేశుని మాత్రమే ఇలా ఎందుకు నిమజ్జనం చేస్తారు? ఇలా చాలామందికి డౌట్స్ వస్తాయి. చదవండి.

Ganesh Chaturthi 2023 : భారతదేశంలో ప్రముఖ వినాయక దేవాలయాలు ఇవే..

భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకచవితి వేడుక జరుపుకుంటాం. రుతుధర్మానుసారంగా ఎండలు పెద్దగా ఉండని సమయం. వర్షపు తడితో ఉన్న భూమి ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనంతో నిండి ఉంటుంది. ఎటు చూసినా చెట్లు పూవులు పూసి పరిమళాలు వెదజల్లుతుంటాయి. నదుల నిండా నీరు నిండి ఉంటుంది. బుధుడు అధిపతి హస్త.. వినాయకుని జన్మనక్షత్రం కూడా అదే. బుధ గ్రహానికి ఆకుపచ్చని రంగు అంటే ఇష్టం. వినాయకుడిని కూడా గడ్డి జాతి మొక్కలంటే ఇష్టం. అందుకే గణేశుని గరికతో, ఆకులతోనూ పూజిస్తాం.

గణేశుని మట్టితో చేయడం వెనుక కూడా విశేషముంది. ఈ కాలంలో జలాశయాల్లో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. మట్టితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి అంటితే మంచిది. ఒండ్రుమట్టిలో నానడం శరీరానికి మంచిదని ప్రకృతి చికిత్స వైద్యులు చెబుతుంటారు. ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసిందే. షోడశోపచార పూజల్లో వాడే పత్రిని మనం తాకడం వల్ల కూడా వాటిలోని ఔషధ గుణాలు మనలోకి ప్రవేశిస్తాయి. తొమ్మిది రోజులు విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో గాలి ఔషధ గుణాల్ని పంచుతుంది. ఎంతో మేలు చేస్తుంది.

Ganesh Chaturthi 2023 : ఈ 21 ఆకులతో గణపతిని పూజిస్తే మీ ఇంట్లో సిరిసంపదలకు లోటుండదు

వినాయకుడిని దగ్గరలో ఉన్న చెరువు, నది లేదంటే బావిలో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్లుగా ఈ కాలంలో నదులు, చెరువులు నిండుగా కళకళలాడుతుంటాయి. మట్టి విగ్రహాల్ని, పత్రిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. ఇటీవల కాలంలో గణపతికి రసాయనిక రంగులు వేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటిలో నివసించే జీవులకు హానికారకమవుతుంది. అదేవిధంగా ఆ నీటిని వాడేవారికి రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై ప్రజలు ఏటా చైతన్యం కలిగించేందుకు పలు సంస్థలు మట్టి గణేశ విగ్రహాలను పంచుతుంటారు.