supreme court
Supreme Court key decision : సుప్రీంకోర్టు ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి “హైబ్రీడ్” విధానంలో కోర్టు నిర్వహణ జరుగనుంది. విడతలవారీగా యథాతథ స్థితి కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కరోనా కారణంగా సరిగ్గా ఏడాది తర్వాత కోర్టుల విచారణలో ప్రత్యక్షంగా తిరిగి పాల్గొనే అవకాశం కల్పించింది. వీడియో ద్వారా లేదా ప్రత్యక్షంగా వాదనలు వినిపించే అవకాశాన్ని న్యాయవాదులకే వదిలివేసింది.
మంగళవారం, బుధవారం, గురువారం రోజున తుది దశకు వచ్చిన కేసులను విచారించనున్నారు. ప్రత్యక్షంగా కానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ వాద, ప్రతివాదనల్లో పాల్గొనవచ్చు. పిటీషనర్లు, రెస్పాండెంట్లు రెండు విధానాల్లో దేనినైనా ఎంచుకోవచ్చు.
సోమవారం, శుక్రవారం కొత్త కేసులు, మెన్షనింగులు జరుగనున్నాయి. ఈ రెండు రోజులు మాత్రం కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ విధానం కొనసాగనుంది. ఈ మేరకు పాలనా విభాగం సాంకేతికపరమైన ఏర్పాట్లు చేస్తోంది.