Rajya Sabha Members : ఈ ఏడాది పూర్తికానున్న 77 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, పీయూష్​ గోయల్​ వంటి ప్రముఖుల పదవీ కాలం ముగియనుంది. ఖాళీ కానున్న స్థానాలు తిరిగి వైసీపీ, టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.

Mps

Tenure of the Rajya Sabha Members : దేశంలో ఈ ఏడాది 77 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తికానుంది. 2022లో 77 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నట్లు రాజ్యసభ సచివాలయం తెలిపింది. ఆంధ్రప్రదేశ్​ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీల పదవీకాలం ముగియనుంది. 2022, జూన్‌ 21 నాటికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపీలు సురేష్‌ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌, విజయసాయిరెడ్డి పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నుంచి ఎంపీలు లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీకాలం ముగియనుంది.

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, పీయూష్​ గోయల్​ వంటి ప్రముఖుల పదవీ కాలం ముగియనుంది. ఖాళీ కానున్న స్థానాలు తిరిగి వైసీపీ, టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. మరో మూడు స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి కొత్తవారిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది.

Peacock Dead : చనిపోయిన నెమలిని పూడ్చేందుకు తీసుకెళ్తున్న వారి వెంటే వెళ్లిన మరో నెమలి

ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 97, కాంగ్రెస్‌కు 34 మంది సభ్యుల సంఖ్యా బలం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరు సీట్ల వరకు తన బలాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. రాజ్యసభలో డీఎంకే, వైసీపీ బలం పెరగనుంది. ఇతర రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేసే ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ (కర్ణాటక), ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ (ఝార్ఖండ్‌), పీయూష్‌ గోయల్‌ (మహారాష్ట్ర), కాంగ్రెస్‌ నుంచి ఆనంద్‌ శర్మ (హిమాచల్‌ప్రదేశ్‌), జైరాం రమేశ్‌ (కర్ణాటక), ఏకే ఆంటోనీ (కేరళ), పి.చిదంబరం (మహారాష్ట్ర), అంబికా సోనీ (పంజాబ్‌), కపిల్‌ సిబల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) ఉన్నారు.

మళ్లీ ఏదో ఒక రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు ఎన్నిక కానున్నారు. కాంగ్రెస్‌ నేతల్లో ఒకరిద్దరు మినహాయించి మిగిలిన వారంతా పెద్దల సభలో అడుగుపెట్టడానికి అవకాశం ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అనంతరం కొత్త రాజ్యసభ సభ్యుల ఎంపిక జరిగే అవకాశం ఉంది. యూపీలో పార్టీలు గెలుచుకునే అసెంబ్లీ సీట్ల ఆధారంగా ప్రస్తుతం యూపీ నుంచి పదవీ విరమణ చేసే 11 స్థానాల భవితవ్యం తేలనుంది.

Voters List : తెలంగాణలో ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా..?

ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలోనూ బీజేపీకి ఇదివరి కంటే సీట్లు తగ్గే అవకాశం ఉంది. సీపీఎం కేరళలో బలాన్ని పెంచుకుని, త్రిపురలోని సీటును కోల్పోనుంది. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి అక్కడ ఈ సీట్లు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది.