Peacock Dead : చనిపోయిన నెమలిని పూడ్చేందుకు తీసుకెళ్తున్న వారి వెంటే వెళ్లిన మరో నెమలి

చనిపోయిన ఒక నెమలిని పూడ్చేందుకు ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తుండగా.. వారినే అనుసరించింది మరో నెమలి. విగత జీవిగా మారిన తన జీవిత భాగస్వామిని అది ఫాలో అయ్యింది.

Peacock Dead : చనిపోయిన నెమలిని పూడ్చేందుకు తీసుకెళ్తున్న వారి వెంటే వెళ్లిన మరో నెమలి

Peacock

peacock dead : జీవిత భాగస్వామి మరణాన్ని మనుషులే కాదు, పశువులు, పక్షులు కూడా భరించలేవు. చనిపోయిన ఒక నెమలిని పూడ్చేందుకు ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తుండగా.. వారినే అనుసరించింది మరో నెమలి. విగత జీవిగా మారిన తన జీవిత భాగస్వామిని అది ఫాలో అయ్యింది.

దాని అంత్యక్రియలు పూర్తయినంత వరకు మనుషుల వెంటే ఉన్నది ఆ నెమలి. ఆ వీడియో ఎంతో మంది హృదయాలను టచ్‌ చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్‌ ఖాతాలో టచింగ్ వీడియో పేరుతో ఆ వీడియోను పోస్ట్‌ చేశారు.

Voters List : తెలంగాణలో ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా..?

ఈ ఘటన రాజస్థాన్‌లోని కుచెరా పట్టణంలో జరిగినట్లు ఆయన తెలిపారు. వాట్సాప్‌ ద్వారా ఈ క్లిప్‌ తనకు చేరిందన్నారు. మరణించిన దీర్ఘకాల భాగస్వామిని విడిచిపెట్టేందుకు నెమలి ఇష్టపడటం లేదని… మనసుకు హత్తుకునే వీడియో అని పేర్కొన్నారు. ఆ రెండు నెమళ్లు నాలుగేళ్లు కలిసి జీవించాయని, మరణించిన జీవిత భాగస్వామి అంత్యక్రియల్లో ఆ నెమలి పాల్గొన్నట్లుగా ట్వీట్‌లో తెలిపారు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో మనుషుల కంటే జంతువులే ఎక్కువ ప్రేమ చూపుతాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. పశుపక్ష్యాదులు పడే బాధ వాటిని పెంచే వారికే ఎక్కువగా తెలుస్తుందని వ్యాఖ్యానించారు.