Covid Callertune
Covid Callertunes : ఇకపై కొవిడ్ కాలర్ ట్యూన్లు వినపడవు. ఇక నుంచి కొవిడ్ కాలర్ ట్యూన్లు బంద్ కానున్నాయి. కొవిడ్ కాలర్‌ట్యూన్లను నిలిపివేసే అంశాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది. కొవిడ్-19పై అవగాహన కోసం టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన ప్రీకాల్- ఆడియో ప్రకటనలు, కాలర్ ట్యూన్లు త్వరలో నిలిచిపోనున్నట్లు సమాచారం.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ ప్రీకాల్ సందేశాలను నిలిపి వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కొవిడ్ కాలర్ ట్యూన్ల వల్ల అత్యవసర సమయాల్లో ఫోన్‌కాల్ మాట్లాడటం ఆలస్యమవుతోందన్న విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో కాలర్ ట్యూన్లను నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.
Omicron BA.2: అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ అలజడి
ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం లేఖ రాసింది. భారత సెల్యులర్ ఆపరేటర్ల సంఘం, మొబైల్ వినియోగదారుల నుంచి కాలర్ ట్యూన్ నిలిపివేతపై కేంద్రానికి విజ్ఞప్తులు అందాయి. కొవిడ్ నేపథ్యంలో వ్యాక్సినేషన్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే విధంగా కేంద్రం 2020లో కాలర్ ట్యూన్లను ప్రవేశపెట్టింది.