Omicron BA.2: అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ అలజడి

ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ BA.2 అమెరికాలో వ్యాప్తి చెందుతున్నట్లు రీసెంట్ కేసులు చెబుతున్నాయి. గత రెండు వారాలుగా జరిపిన పరీక్షల్లో వస్తున్న పాజిటివ్ ఫలితాలతో ప్రజల్లో భయాందోళనలు ...

Omicron BA.2: అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ అలజడి

Omicron Variant (1)

Omicron BA.2: ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ BA.2 అమెరికాలో వ్యాప్తి చెందుతున్నట్లు రీసెంట్ కేసులు చెబుతున్నాయి. గత రెండు వారాలుగా జరిపిన పరీక్షల్లో వస్తున్న పాజిటివ్ ఫలితాలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. శాన్ డీగోకు చెందిన జెనోమిక్స్ కంపెనీ హెలిక్స్ అమెరికాలో కొత్త వేరియంట్ ను మానిటర్ చేస్తుంంది.

ఈ క్రమంలోనే అమెరికా వ్యాప్తంగా 50 నుంచి 70శాతం BA.2 కేసులు ఉన్నట్లు హెలిక్స్ అంచనా వేస్తుంది. హెలిక్స్ చీఫ్ సైన్స్ ఆఫీసర్ లీ మాట్లాడుతూ ఈ నిఘా సాయంతో అమెరికా హెల్త్ కేర్ సిస్టమ్ కు ఫ్యూచర్ వేరియంట్స్ ఎఫెక్ట్ రాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.

యూకే నుంచి అందిన డేటా ప్రకారం.. అమెరికాలో BA.2 వేరియంట్ ఇప్పటికే దాదాపు వేగంగా వ్యాపించిందని సమాచారం. అక్కడ నమోదైన పాజిటివ్ కేసుల్లో 50శాతం ఈ వేరియంట్ వే. గతంలో ఒమిక్రాన్ వ్యాపించిన వారికి కూడా మరోసారి ఇన్ఫెక్ట్ అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

Read Also: ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్.. కనుక్కోవడం చాలా కష్టం.. టెస్ట్‌లో నెగెటివ్ రావచ్చు

ప్రస్తుతం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా.. అది ఎంతోకాలం నిలవదని చెబుతున్నారు. ఎందుకంటే న్యూయార్క్ సిటీలో BA.2 వేరియంట్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం.. వేరియంట్ వ్యాప్తి చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది.