Gyanvapi Mosque Case : జ్ఞానవాపి మసీదు కేసు..హిందూపక్షం పిటిషన్ విచారణకు అనుమతి, ముస్లిం పక్షం పిటిషన్ తిరస్కరణ

జ్ఞానవాపి మసీదులో శృంగేరి గౌరి విగ్రహం వద్ద పూజల నిర్వహణపై హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. జ్ఞానవాపి కేసు విచారణ నేపథ్యంలో వారణాసిలో హై అలర్ట్ ప్రకటించారు. వారణాసిలో 144 సెక్షన్ విధించారు. తీర్పు తర్వాత ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

Gyanvapi mosque case  : జ్ఞానవాపి మసీదులో శృంగేరి గౌరి విగ్రహం వద్ద పూజల నిర్వహణపై హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. జ్ఞానవాపి కేసు విచారణ నేపథ్యంలో వారణాసిలో హై అలర్ట్ ప్రకటించారు. వారణాసిలో 144 సెక్షన్ విధించారు. తీర్పు తర్వాత ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రశాంత పరిస్థితుల కోసం మత పెద్దలతో పోలీసులు సంప్రదింపులు జరిపారు.

మసీదు ప్రాంగణంలోని హిందు దేవతలను పూజించేందకు అనుమతి కోరుతూ గతంలో ఐదుగురు మహిళలు పిటీషన్ దాఖలు చేశారు. ప్రత్యేక కమిటీ వీడియో సర్వే నిర్వహించింది. ముస్లిం పక్షాల మతపరమైన ప్రార్ధనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం వాదనను వారణాసి జిల్లా కోర్టు తిరస్కరించింది. హిందువుల తరఫు పిటిషన్ ను వారణాసి కోర్టు విచారించడానికి స్వీకరించింది. మసీదు అంజుమన్ కమిటీ ( ముస్లిం పక్షం) వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా పడింది.

GYANVAPI ROW : జ్ఞానవాపి మసీదులోకి శివలింగం ఎలా వచ్చింది ? వీడియోగ్రఫీ సర్వేలో ఏం తేలింది ?

సుప్రీంకోర్టుకు వరకు వచ్చిన జ్ఞానవాపి వ్యవహారం చివరకు జిల్లా కోర్టులోనే విచారణ జరిగింది. న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టాలని సీజేఐ ధర్మాసనం ముందు అశ్వని ఉపాధ్యాయ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో విచారణ చేపట్టేందుకు సీజేఐ ధర్మాసనం సుముఖత చూపింది.

ట్రెండింగ్ వార్తలు