GYANVAPI ROW : జ్ఞానవాపి మసీదులోకి శివలింగం ఎలా వచ్చింది ? వీడియోగ్రఫీ సర్వేలో ఏం తేలింది ?

మందిరాలు - మసీదుల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. బాబ్రీ మసీదు తర్వాత ఆ స్థాయిలో వార్తల్లోకెక్కింది వారణాసిలోని జ్ఞానవాపి మసీదు. ఈ వివాదం కోర్టు మెట్లెక్కడం, మసీదులో శివలింగం కనిపించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు ఇది హిందూ దేవాలయమన్న వాదనలకు బలం చేకూరుతోంది. దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇంతకీ మసీదులోకి శివలింగం ఎలా వచ్చింది ? వీడియోగ్రఫీ సర్వేలో ఏం తేలింది ?

GYANVAPI ROW : జ్ఞానవాపి మసీదులోకి శివలింగం ఎలా వచ్చింది ? వీడియోగ్రఫీ సర్వేలో ఏం తేలింది ?

Gnanavapi Masjid In Shivlinga

GYANVAPI ROW : మందిరాలు – మసీదుల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. బాబ్రీ మసీదు తర్వాత ఆ స్థాయిలో వార్తల్లోకెక్కింది వారణాసిలోని జ్ఞానవాపి మసీదు. ఈ వివాదం కోర్టు మెట్లెక్కడం, మసీదులో శివలింగం కనిపించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు ఇది హిందూ దేవాలయమన్న వాదనలకు బలం చేకూరుతోంది. దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇంతకీ మసీదులోకి శివలింగం ఎలా వచ్చింది ? వీడియోగ్రఫీ సర్వేలో ఏం తేలింది ?

నాడు బాబ్రీ మసీదులో రాముడు..నేడు జ్ఞానవాపి మసీదులో శివుడు..మందిరం – మసీదు మధ్య వివాదాలు..జ్ఞానవాపి మసీదులో భారీ శివలింగం..మసీదులో ఉన్న శివలింగం కాదు ఫౌంటైన్ అంటున్న ముస్లిం సంఘాలు..అయోధ్య తరహాలో ఇప్పుడు మరో వివాదం రాజుకుంటోంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేంద్రంగా రేగిన వివాదం రోజు రోజుకు ముదురుతోంది. హిందూ ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని ఒకరు.. దేశంలో ప్రముఖ మసీదులపై కుట్ర చేస్తున్నారని మరొకరు.. ఇలా మాటల మంటల నడుమ రచ్చ పీక్స్‌కు చేరుకుంటోంది.ఇదే సమయంలో కోర్టు ఆదేశాలతో మసీదులో జరిగిన వీడియోగ్రఫీ సర్వేలో భారీ శివలింగం బయటపడడం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. గతేడాది కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండటంతో జ్ఞానవాపి మసీదు కమిటీ కారిడార్ ప్రాజెక్ట్ కోసం కొంత భూమిని ఇచ్చింది. ఈ భూమి మసీదుకు కొద్ది దూరంలో ఉంది. కోర్టు వెలుపల జరిగిన ఈ ఒప్పందం పట్ల అంతా సంతోషం వ్యక్తం చేశారు.హిందూ ముస్లింల మధ్య సుహృద్భావ పరిణామంగా చెప్పుకున్నారు. ఏడాది తిరగక ముందే ఆ వాతావరణం చెడిపోయింది. ఇప్పుడు జ్ఞానవాపి మసీదు కేంద్రంగా మంట రాజుకుంటోంది. మసీదు బావిలో నిజంగా ఉన్నది శివలింగమేనా..? అసలు బావిలోకి శివలింగం ఎలా వచ్చింది..? ఆ బావి మసీదులో ఎందుకు ఉందన్నదే ఇప్పుడు కాశీ స్థల వివాదాన్ని కొత్త మలుపు తిప్పబోతోంది.

Also read : Rajiv Gandhi Murder Case: రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రింకోర్టు కీలక తీర్పు..

నిజానికి ఈ వివాదం నిన్న మొన్నటి కాదు. దీనికి కూడా మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. మంట 1991లోనే మొదలైంది. కాశీ విశ్వనాథుడి ఆలయం కూల్చేసి ఆ స్థానంలో మసీదు కట్టారని 1991 అక్టోబర్ 15న పండిట్ సోమ్‌నాథ్‌ వ్యాస్, డాక్టర్ రామ్‌రంగ్‌ శర్మతో పాటు పలువరు వారణాసి కోర్టును ఆశ్రయించారు. మసీదు ప్రాంతంలో కొత్తగా ఆలయం నిర్మించి పూజలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. అటు పిటిషన్‌ వేయగానే ఇట్నుంచి కౌంటర్ పడింది. మసీదు తరుపున అంజుమన్ ఇంతెజామియా మసీద్ స్టే కోర్టుతూ నేరుగా హైకోర్టునే ఆశ్రయించింది. అలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆ కేసు 1998 వరకు పెండింగ్‌లోనే ఉండిపోయింది. అయితే 2019లో సుప్రీం కోర్టు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో.. మరోసారి జ్ఞానవాపి మసీదు వివాదం తెరపైకి వచ్చింది. ఇటుఅటుగా ఆ కేసు కూడా అలాంటిదే కావడంతో… న్యాయవాది విజయ్‌ శంకర్‌ రస్తోగీ కొత్త పిటిషన్ వేశారు. మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే నిర్వహించాలని కోరారు. 2021 ఏప్రిల్‌ 8న కోర్టు ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌ బోర్డు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర స్టే ఇచ్చింది.

ఇలా 30 ఏళ్ల నుంచి ఈ వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతునే ఉంది. ఇలాంటి సమయంలో ఐదుగురు మహిళలు ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పేలా చేశారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శృంగార గౌరి గణపతి, హనుమంతుడి విగ్రహాలకు నిత్యపూజలు జరిపించే అవకాశం ఇవ్వాలని విశ్వ వేదిక్‌ సనాతన్‌ సంఘ్‌ తరుపున ఐదుగురు మహిళలు గతేడాది కోర్టులో పిటిషన్ వేశారు. దీనితో పాటు వీడియోగ్రఫీని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను అంగీకరిస్తూ కోర్టు జ్ఞాన్‌వాపి మసీదు సర్వే జరపాలని, వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించింది. ఈ సర్వే ఫలితాలను గోప్యంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పుడే ఓ రహస్యం బయటపడింది. మసీదు ప్రాంగణంలో ముస్లింలు శుభ్రం చేసుకునే వ‌జుఖానాలో ఓ బావి ఉంది… దాంట్లో ఉన్న నీటి స్థాయిని తగ్గించిన తర్వాత అక్కడ శివ‌లింగం ఉన్నట్లు గుర్తించారు.ఈ విషయాన్ని మహిళా పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో మసీదు దగ్గర సీఆర్పీఎఫ్ క‌మాండోలను ర‌క్షణ‌గా నియ‌మించారు. మసీదులో శివలింగం బయట పడడంపై హిందుత్వ సంఘాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అక్కడ దేవాలయం ముందునుంచీ ఉందనే వాదనను ఇది బలపరుస్తోందంటున్నారు పిటిషనర్లు.

Also read : AP politics : వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఆశలు ఫలించేనా? వచ్చే ఎన్నికల్లోనైనా టికెట్ దక్కేనా? ఇతర పదవులైనా ఇస్తారా?..

జ్ఞానవాపి మసీదు కమిటీ మాత్రం ఈ వాదనలను ఖండిస్తోంది. సర్వే బృందానికి కనిపించినది ఫౌంటెయిన్‌కు చెందిన ఒక భాగమే తప్ప శివలింగం కాదంటోంది. తమ వాదనలు పూర్తి కాకుండానే ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలంటూ కోర్టు ఆదేశించిందని ఆరోపించింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ వివాదంపై ఘాటుగానే స్పందించారు. బాబ్రీ తర్వాత మరో మసీదును కోల్పోయేందుకు ముస్లింలు సిద్ధంగా లేరన్నారు. బాబ్రీ మసీదులో 1949లో అకస్మాత్తుగా హిందూ దేవతా విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయని.. అలాంటి కుట్రలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని.. ముస్లిం సంఘాలను హెచ్చరించారు. పిడిపి చీఫ్‌ మెహబూబా ముఫ్తీ మీరు ఎన్ని మసీదుల మీద కన్ను వేశారో చెప్పండంటూ… మాటల తూటాలు పేల్చారు. మొత్తంగా ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది.