Parliament Winter Session : నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. సభ ముందుకు 16 కొత్త బిల్లులు!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 17 రోజులు ఉభయ సభల సమావేశాలు జరుగనున్నాయి.
- bheemraj
- Updated on- December 7, 2022 / 11:33 AM IST
Parliament winter session
Parliament Winter Session : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 17 రోజులు ఉభయ సభల సమావేశాలు జరుగనున్నాయి. 16 కొత్త బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది.
వీటిలో బయోలాజికల్ డైవర్సిటీ, మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీలు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు, నేషనల్ డెంటల్ కమిషన్, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కమిషన్ బిల్లు, కోస్టల్ ఆక్వాకల్చర్ బిల్లు, అటవీ సంరక్షణ చట్ట సవరణ వంటి పలు బిల్లులు ఉన్నాయి.
Trinamool MP: పార్లమెంట్‌లోకి వంకాయ తీసుకొచ్చిన మహిళా ఎంపీ.. ఎందుకంటే..
మరోవైపు ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఈడబ్ల్యూఎస్ కోటా, రూపాయి మారకపు విలువ పతనం, ఇండోనేషియా-చైనా సరిహద్దు సమస్య, అధిక జీఎస్టీ పన్నులు తదితర అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని అఖిలపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి.
