Trinamool MP: పార్లమెంట్‌లోకి వంకాయ తీసుకొచ్చిన మహిళా ఎంపీ.. ఎందుకంటే..

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ ధరల పెరుగుదలపై వినూత్నంగా నిరసన తెలిపారు. ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా పచ్చి వంకాయను పార్లమెంట్‌కు తీసుకొచ్చారు.

Trinamool MP: పార్లమెంట్‌లోకి వంకాయ తీసుకొచ్చిన మహిళా ఎంపీ.. ఎందుకంటే..

Trinamool Mp

Trinamool MP: పార్లమెంట్‌లోకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీ కకోలి ఘోష్ పచ్చి వంకాయ తీసుకొచ్చారు. ఎల్పీజీ ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై వినూత్నంగా నిరసన తెలిపారు. దేశంలో పెరుగుతున్న నిత్యావసరాలు, ఎల్పీజీ ధరలపై సోమవారం ఆమె లోక్‌సభలో ప్రసంగించారు.

5G Spectrum: ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. 1.5 లక్షల కోట్లు దాటిన బిడ్లు

ముఖ్యంగా ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపుపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘‘పెరుగుతున్న ధరలపై చర్చించేందుకు స్పీకర్ అనుమతిస్తారనుకుంటున్నా. ప్రజలు వంట చేసుకోకుండా పచ్చి కూరగాయలు తినాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోందా? వంట గ్యాస్ ధరల్ని కేంద్రం విపరీతంగా పెంచింది. కొన్ని నెలల్లోనే నాలుగుసార్లు పెంచింది. రూ.600 నుంచి రూ.1,100కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సామాన్యులు ఎలా వంట చేసుకోగలుగుతారు. ఇలాగైతే వంట చేసుకోకుండా పచ్చి కూరగాయలే తినాల్సొస్తుంది’’ అంటూ కకోలి ఘోష్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పచ్చి వంకాయను కొద్దిగా రుచి చూశారు. ఎల్పీజీ ధరలు తగ్గకపోతే ప్రజలు పచ్చి కూరగాయలే తినాల్సిన పరిస్థితి వస్తుందని ఆమె అన్నారు.

Jackfruit: పనస పండు కోసం ఏనుగు కష్టం.. వైరల్‌గా మారిన వీడియో

కేంద్రం ఎల్పీజీ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. ఏడాది కాలంగా కేంద్ర ఎనిమిదిసార్లు ఎల్పీజీ ధరల్ని పెంచింది. సబ్సిడీ లేని సిలిండర్‌ ధర పెరగడం వల్ల సామాన్యులు గ్యాస్ సిలిండర్ కొనలేని పరిస్థితి వచ్చిందని ఆమె అన్నారు. ప్రస్తుతం ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీపై సిలిండర్ లభిస్తోంది.