5G Spectrum: ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. 1.5 లక్షల కోట్లు దాటిన బిడ్లు

వారం రోజులుగా సాగిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ వేలంలో రిలయన్స్ జియో సంస్థ అత్యధికంగా 84 వేల కోట్ల బిడ్లు దాఖలు చేసింది.

5G Spectrum: ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. 1.5 లక్షల కోట్లు దాటిన బిడ్లు

5g Spectrum

5G Spectrum: గత వారం ప్రారంభమైన 5జీ స్పెక్ట్రమ్ వేలం సోమవారం ముగిసింది. ఈ వేలంలో మొత్తం రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలవడం విశేషం. గత మంగళవారం ప్రారంభమైన వేలం ప్రక్రియ దాదాపు వారంపాటు సాగింది. మొత్తం 40 రౌండ్లుగా వేలం ప్రక్రియ నిర్వహించారు. ఈ వేలంలో అత్యధికంగా రిలయన్స్ జియో సంస్థ రూ.84,500 కోట్ల బిడ్లు దాఖలు చేసింది.

Rajasthan: అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న కానిస్టేబుల్‌పై ఇసుక మాఫియా దాడి

ఆ తర్వాత ఎయిర్‌టెల్ సంస్థ రూ.46,500 కోట్లు, వొడాఫోన్ ఐడియా సంస్థ రూ.18,500 కోట్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రూ.5,000 కోట్ల బిడ్లు దాఖలు చేశాయి. గత సంవత్సరం నిర్వహించిన 4జీ వేలం కంటే ఈసారి 5జీ స్పెక్ట్రమ్ వేలం బిడ్లు దాదాపు రెట్టింపు పలకడం విశేషం. అప్పట్లో 4జీ వేలం ద్వారా రూ.77,815 కోట్ల ఆదాయం వస్తే, ఈ సారి 1.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2010లో నిర్వహించిన 3జీ వేలం కంటే ఈసారి 3 రెట్లు ఎక్కువ ఆదాయం రాబోతుంది. ఈ వేలంలో జియో, ఎయిర్‌టెల్ సంస్థలు దేశవ్యాప్తంగా 5జీ స్పెక్ట్రమ్ హక్కులు దక్కించుకోగా, అదానీ గ్రూప్ 26 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ హక్కులు దక్కించుకుంది. వొడాఫోన్ ఐడియా మాత్రం కొన్ని సర్కిళ్లకు చెందిన హక్కుల్ని మాత్రమే పొందినట్లు సమాచారం.

Uttar Pradesh: 48 గంటలపాటు అత్యవసర చికిత్స ఉచితం… యూపీ ప్రభుత్వం నిర్ణయం

ఏ సంస్థ ఏయే హక్కులు పొందాయో కొద్ది రోజుల తర్వాతే తెలుస్తుంది. మొత్తం 10 బ్యాండ్లలో 72 గిగాహెర్జ్ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించగా, అందులో 600 మెగాహెర్జ్, 800 మెగాహెర్జ్, 2,300 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌కు సంబంధించి ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. 5జీ బ్యాండ్లకు సంబంధించి 3,300 మెగాహెర్జ్, 26 గిగాహెర్జ్ స్పెక్ట్రానికి మాత్రం మూడింట రెండొంతుల బిడ్లు దాఖలయ్యాయి. ఈ వేలం ప్రక్రియ ద్వారా భారీ ఆదాయం సమకూరడంతో 5జీకి సంబంధించిన మౌలిక సదుపాయాల్ని ప్రభుత్వం మరింత వేగంగా ఏర్పాటు చేసేందుకు ఉపయోగపడుతుంది.