Uttar Pradesh: 48 గంటలపాటు అత్యవసర చికిత్స ఉచితం… యూపీ ప్రభుత్వం నిర్ణయం

అత్యవసర వైద్య చికిత్స అవసరమైన వారికి 48 గంటలపాటు ఉచితంగా చికిత్స అందించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు. ఈ పథకం త్వరలోనే అమల్లోకి రాబోతుంది.

Uttar Pradesh: 48 గంటలపాటు అత్యవసర చికిత్స ఉచితం… యూపీ ప్రభుత్వం నిర్ణయం

Uttar Pradesh

Uttar Pradesh: యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని యూపీ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు ప్రారంభించింది. పౌరులకు మెరుగైన వైద్యం అందించే ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడైనా 48 గంటలపాటు అత్యవసర చికిత్సను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.

Chiranjeevi: 7వ తరగతిలోనే… అంటూ చిలిపి పనులు బయటపెట్టిన మెగాస్టార్

దీనితోపాటు ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాల ఏర్పాటు, వైద్య కళాశాలల ఏర్పాటు, అధునాతన సదుపాయాలు ఉన్న అంబులెన్స్‌ల కొనుగోలు వంటి వాటి కోసం దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించింది. వచ్చే ఐదేళ్లలో వైద్యరంగంలో చేపట్టబోయే కార్యక్రమాలకు ఈ నిధులు వెచ్చిస్తారు. ప్రభుత్వం ఇప్పటికే ‘వన్ డిస్ట్రిక్.. వన మెడికల్ కాలేజ్’ స్కీం పేరిట 75 జిల్లాల్లో, 75 వైద్య కళాశాలల్ని నిర్మించాలని భావిస్తోంది. త్వరలో ‘లైవ్ ఎమర్జెన్సీ మానిటరింగ్’ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేయబోతుంది. దీని ద్వారా ఎవరికైనా.. ఏ ఆస్పత్రుల్లోనైనా త్వరగా అడ్మిషన్ దొరుకుతుంది. అందులోనూ ఎమర్జెన్సీ కేసులకు త్వరగా అడ్మిషన్ ఇచ్చి, త్వరగా చికిత్స అందేలా చూస్తారు.

Monkeypox: మంకీపాక్స్ లక్షణాలతో కేరళవాసి మృతి

అధునాతన లైఫ్ సపోర్టింగ్ ఎక్విప్‍మెంట్‌తో కూడిన అంబులెన్స్‌లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఒక్క కాల్ ద్వారా అంబులెన్స్ సదుపాయం కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 750 అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తారు. అత్యవసర చికిత్స, ట్రామా ట్రీట్‌మెంట్ కోసం ప్రతి సంవత్సరం రూ.550 కోట్లు కేటాయిస్తారు. ఇక ప్రభుత్వం తీసుకురానున్న అత్యవసర ఉచిత చికిత్స ఎందరికో మేలు చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితిలో డబ్బు లేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తోంది.