Rajasthan: అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న కానిస్టేబుల్‌పై ఇసుక మాఫియా దాడి

ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. అక్రమ ఇసుక తరలింపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌పై ఇసుక మాఫియా దాడికి పాల్పడింది. ఆరుగురు దుండగులు కానిస్టేబుల్‌పై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.

Rajasthan: అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న కానిస్టేబుల్‌పై ఇసుక మాఫియా దాడి

Rajasthan

Rajasthan: అక్రమ మైనింగ్ మాఫియా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రానైట్ రాళ్లు, ఇసుక తరలింపును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై మైనింగ్ మాఫియా దాడులకు పాల్పడుతోంది. అక్రమ మైనింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఒక పోలీసును ట్రక్కుతో తొక్కి చంపిన ఘటన మరువక ముందే మరో కానిస్టేబుల్‌పై దాడికి తెగబడిందో మాఫియా. తాజా ఘటన రాజస్థాన్‌లో జరిగింది.

Uttar Pradesh: 48 గంటలపాటు అత్యవసర చికిత్స ఉచితం… యూపీ ప్రభుత్వం నిర్ణయం

కోట జిల్లాలో ఆదివారం సాయంత్రం ఒక కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడింది ఇసుక మాఫియా. ఘటోలి చెక్‌పోస్ట్ సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తుండటాన్ని కానిస్టేబుల్ రామ చంద్ర గమనించాడు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. ఇసుక మాఫియాను పట్టుకునేందుకు ఇంకొంతమంది సిబ్బందిని పంపించమని అడిగాడు. వాళ్లు వచ్చేలోపే ఇసుక మాఫియా రామ చంద్రపై దాడి చేసింది. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. మరో ఐదుగురు వ్యక్తులు కూడా కానిస్టేబుల్‌ను కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టారు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని అక్కడే వదిలేసి ట్రాక్టర్‌తోసహా పారిపోయారు.

Chiranjeevi: 7వ తరగతిలోనే… అంటూ చిలిపి పనులు బయటపెట్టిన మెగాస్టార్

పోలీసులు అక్కడికి చేరుకునేలోపే రామ చంద్ర గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రామ చంద్రకు తీవ్రంగా గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన జరగడానికి ముందు ఆగ్రా-జైపూర్ రహదారిపై ఒక పోలీసు బృందంపై ఇసుక మాఫియా కాల్పులు జరిపింది. అక్కడ కూడా ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగానే ఈ దాడి జరిగింది.