2024 వరకు తగినంత కోవిడ్ టీకాలు ఉండవు -ఆదార్ పూనవల్లా

  • Publish Date - September 15, 2020 / 09:34 AM IST

ప్రపంచంలో 2024 వరకు తగినంత కోవిడ్ – 19 వ్యాక్సిన్లు అందుబాటులో ఉండవని వ్యాక్సిన్ తయారీ సంస్థ Serum Institute of India’s CEO ఆదార్ పూనవల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చినా.. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలంటే కనీసం నాలుగైదేళ్ల సమయం పడుతుందన్నారు.

ఒకవేళ రెండు డోస్‌ల వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వస్తే.. ప్రపంచం మొత్తం 1500 కోట్ల వ్యాక్సిన్‌లు అవసరమవుతాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల సమయం పడుతుందన్నారు. AstraZeneca, Novavax ఐదు అంతర్జాతీయ ఔషధ సంస్థలతో ఈ సంస్థ అనుబంధం కలిగి ఉంది. ఒక బిలియన్ వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.



అందులో సగం భారతదేశానికి ఇస్తామని గతంలో ఆధార్ పూనవల్లా వెల్లడించిన సంగతి తెలిసిందే. టీకాను ఎక్కువగా అవసరమైన వారికి అందుబాటులో ఉంచుతామని, టీకా యొక్క భద్రత, ఖర్చు, ఉత్పత్తి, సమయ పాలన తదితర అంశాలపై చర్చించామన్నారు.
https://10tv.in/bharat-biotech-find-wonderful-results-with-covaxin-medicine-of-covid/
వచ్చే ఏడాది ప్రారంభంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్దన్ చెప్పిన మరుసటి రోజే అదార్ పూనావాలా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్ మాత్రమే మార్గమని, 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో కరోనాకు విరుగుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. వైరస్‌పై పోరులో ముందుండి ప్రజలను రక్షిస్తున్న డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందికి తొలుత వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్ చర్చ సందర్భంగా ఆరోగ్య మంత్రి ఈ విషయం వెల్లడించారు.

టీకా తయారు చేసిన తర్వాత ప్రజలకు ఏమైనా అనుమానం వస్తే, మొదట టీకా నేనే తీసుకుంటానని ఆరోగ్య మంత్రి చెప్పారు. టీకా అందుబాటులో ఉన్నప్పుడు, మొదట ఆరోగ్య కార్యకర్తలు, సీనియర్ సిటిజన్లు మరియు ఫ్రంట్‌లైన్‌లో పనిచేసే కరోనా వారియర్స్‌కి ఇస్తామని చెప్పారు.



దేశంలో కరోనా వైరస్‌‌ను కంట్రోల్ చెయ్యడానికి కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు తయారీకి కేంద్రం సహకరిస్తుండగా.. దేశవ్యాప్తంగా కోవిడ్‌ మాత్రం కంట్రోల్‌కి రాట్లేదు. ఇప్పటికే చాలా ఔషద సంస్థలు రెండోదశ ప్రయోగాలను పూర్తి చేసుకుని మూడో స్టేజ్‌కు ప్రవేశించాయి.

ట్రెండింగ్ వార్తలు