2020 are my last polls: Nitish Kumar : బీహార్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 2020 తన చివరి ఎన్నికలని ప్రకటించారు. బీహార్ లో ఎన్నికల మూడో దశ పోలింగ్ జరుగనుంది. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం Purnia లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని నితీష్ ప్రసంగించారు.
తనకు చివరి ఎన్నికలు కావడంతో జేడీయూకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. తమ పార్టీని అధికారంలోకి తీసుకరావాలని. Ant bhala to sab bhala అన్నారు. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో జేడీయూ చీఫ్ అనేక నిరసనలను ఎదుర్కొంటున్నారు. నితీష్ చేసిన ప్రకటనపై Lok Janshakti Party (LJP) leader Ajay Kumar స్పందించారు.
https://10tv.in/nitish-kumar-will-bow-down-before-tejashwi-after-november-10-chirag-paswan/
కొత్త ముఖాన్ని ప్రకటించాలని సూచించారు. చివరి ఎన్నికలు అన్నందుకు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆశీర్వదించి రాజకీయాల నుంచి విరమించుకోవాలని నితీష్ కు సూచించారాయన.
అటు నితీష్ ప్రకటనపై కాంగ్రెస్ స్పందించింది. ఇది రాజకీయ కోణంలో చేసే ప్రకటన కావచ్చని, ఓటర్లను ఆకర్షించడానికి జేడీయూ చీఫ్ ఎమోషనల్ కార్డు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది.
ఓడిపోతున్నానని నితీష్ గ్రహించి ఈ విధంగా ప్రకటన చేశారని, ఓటర్లను ఆకర్షించేందుకు ఈ విధంగా ప్రకటన చేయడం కుట్రగా అభివర్ణించారు కాంగ్రెస్ బీహార్ అధ్యక్షుడు మేడం మోహన్ ఝా.
బీహార్ రాష్ట్రంలో మూడో దశ పోలింగ్ నవంబర్ 07వ తేదీన జరుగనుంది. బీహార్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న విడుదల కానున్నాయి. National Democratic Alliance (NDA) విజయం సాధిస్తే…నితీష్ సీఎం అవుతారని బీజేపీ పదే పదే చెప్పింది. మరి నితీష్ చేసిన ఈ ప్రకటన వారి పార్టీకి ఎంత లాభం చేకూరుతుందో చూడాలి.