Corona Vaccination
Corona Vaccination : కోవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నవారు ఆరు నెలల తర్వాత మూడవ డోసు తీసుకోవాల్సి ఉంటుందని సీరం సీఈఓ పూనావాలా పేర్కొన్నారు. రోగనిరోధకశక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది అవసరమని తెలిపారు. తనతోపాటు 7 వేలమంది సీరం ఉద్యోగులు మూడో డోస్ టీకా తీసుకున్నారని పూనావాలా వెల్లడించారు.
ఇక దేశంలో ఇప్పటివరకు 56 కోట్ల టీకాల పంపిణి జరిగింది. టీకా పంపిణి వేగవంతంగా సాగుతుంది. ప్రతి రోజు 60 నుంచి 80 లక్షల మందికి టీకా ఇస్తున్నారు. అక్టోబర్ చివరి నాటికి దేశ ప్రజలందరికి మొదటివిడత టీకా పూర్తయ్యే అవకాశం ఉంది.