జార్ఖండ్ లో మూడో విడత ఎన్నికల పోలింగ్

జార్ఖండ్ లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ సాగనుంది.

  • Publish Date - December 12, 2019 / 06:06 AM IST

జార్ఖండ్ లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ సాగనుంది.

జార్ఖండ్ లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అధికారులు పోలింగ్ కు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మూడో విడతలో 17 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 309 అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. డిసెంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

గురువారం(డిసెంబర్ 12, 2019)ఉదయం 7 గంటల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 17 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసులు డేగా కన్నుతో పర్యవేక్షిస్తున్నారు. కోదార్మ, బర్కాత, బర్తి, బార్కాగావవ్, రామ్‌ఘడ్, మండు, హజారీబాగ్, సిమారియా, ధాన్వార్, గోమియా, బెర్మో, ఇచాఘడ్, సిల్లీ, ఖిర్జీ, రాంచీ, హతియా, కంచె నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిలో ఒకటి ఎస్సీ నియోజకవర్గం కాగా, మరొకటి ఎస్టీ నియోజకవర్గం కావడం గమనార్హం.

32 మంది మహిళలతో సహా 309 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 8 జిల్లాల్లోని 17 అసెంబ్లీ స్థానాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ సాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. నాల్గవ విడత పోలింగ్ డిసెంబరు 16న, ఐదో విడత పోలింగ్ డిసెంబరు 20న జరుగనుంది. డిసెంబరు 23న ఓట్ల లెక్కింపు సాగనుంది. అదే రోజు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.