Kerala Midnight Sale : కేరళలో మిడ్‌నైట్ సేల్ సందడి.. షాపింగ్‌కు భారీగా తరలివచ్చిన కస్టమర్లు

కేరళలో మిడ్ నైట్ సేల్ సందడిగా మారింది. కోచిలోని ‘లులూ’ షాపింగ్ మాల్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు.

Thousands Of Shoppers Flood Kerala's Lulu Mall Outlets For Midnight Sale

Kerala Midnight Sale : కేరళలో మిడ్ నైట్ సేల్ సందడిగా మారింది. కోచిలోని ‘లులూ’ షాపింగ్ మాల్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కేరళలోని తిరువనంతపురం, కోచిలో లులూ అవుట్ లెట్ల వద్ద దృశ్యాలు కనిపించాయి. లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో జనం తరలివస్తున్నారు. అన్ని ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపును లులూ ఆఫర్ చేయడంతో జనమంతా ఎగబడి మరి కొనేందుకు క్యూ కట్టేస్తున్నారు.

దీనికి సంబంధించిన దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పటికే ఈ వీడియోలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాల్స్ బయట మాత్రమే కాదు.. లోపల.. ఎలివేటర్ ఎటువైపు చూసినా జనంతో కిక్కరసిపోయారు. అన్ని ఉత్పత్తులపై 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసింది. దాంతో షాపింగ్ కోసం వేలాది మంది తొక్కిసలాటలో కూడా వస్తువులను కొనేందుకు ఎగబడుతున్నారు.

Read Also : Kerala : తను మార్నింగ్ వాకింగ్ చేయడానికి రోడ్​ బ్లాక్​ చేయించిన ఏసీపీ