Manipur : మణిపుర్‌లో మళ్లీ హింసాకాండ…ముగ్గురి మృతి, ఇళ్లు దహనం

మణిపుర్‌లో శుక్రవారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన తాజా హింసాత్మక సంఘటనల్లో ముగ్గురు మరణించారు. మృతులు క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు చెప్పారు....

Manipur : మణిపుర్‌లో శుక్రవారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన తాజా హింసాత్మక సంఘటనల్లో ముగ్గురు మరణించారు. (fresh violence in Manipur) మృతులు క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు చెప్పారు. తాజా హింసాకాండలో కుకీ వర్గానికి చెందిన పలు ఇళ్లు కూడా దహనం చేశారు. (Bishnupur houses burnt) భద్రతా బలగాలు ఘటనా స్థలంలో ఉన్నా హింసాకాండ కొనసాగింది.

Naxal hotbed Sukma : నక్సల్స్ ఖిల్లా నుంచి యూకేకు…రియా ఫిలిప్ విజయగాథ

కుకీ కమ్యూనిటీకి చెందిన పలు ఇళ్లకు నిప్పంటించగా, మెయితీ వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారని బిష్ణుపూర్ పోలీసులు చెప్పారు. కొంతమంది వ్యక్తులు బఫర్ జోన్‌ను దాటి మెయితీ ప్రాంతాలకు వచ్చి వారిపై కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు తెలిపాయి. గురువారం మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో సాయుధ బలగాలకు, మీతేయ్ కమ్యూనిటీ నిరసనకారుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 17 మంది గాయపడిన రెండు రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది.

Delta Airlines Plane : డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్‌లో మంటలు, ఒకరికి గాయాలు

ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పగటిపూట ఆంక్షలు విధించారు. కంగ్వాయ్, ఫౌగక్చావో ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు సాయుధ బలగాలు, మణిపూర్ పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఓ బారికేడ్ ను దాటేందుకు మీతేయి మహిళలు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. మహిళలను అస్సాం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిలిపివేశాయి. దీంతో సాయుధ దళాలకు మహిళలలకు మధ్య రాళ్ల దాడి, ఘర్షణలకు దారితీసింది. మూడు నెలల క్రితం మణిపుర్ ఈశాన్య రాష్ట్రంలో జాతి హింస చెలరేగింది. ఈ హింసాకాండలో 160 మందికి పైగా మరణించారు. ఈ అల్లర్లలో వందలాది మంది గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు