మాస్క్ లతో మాంగల్యం తంతునానేనా: పెళ్లితో ఒక్కటైన HIV జంటలు

  • Publish Date - July 7, 2020 / 02:47 PM IST

HIV పాజిటివ్ వచ్చినవారిని సమాజం చాలా చిన్నచూపు చూస్తుంది. కానీ HIV తోటి మనుషుల నుంచి ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి సమాజానికి దూరంగా..అన్నింటికీ సుదూరంగా బ్రతుకులు వెళ్లబుచ్చుతున్నారు HIV బాధితులు. అటువంటివారికి అండగా మేమున్నామంటున్నాయి కొన్ని స్వచ్ఛంధ సంస్థలు.

HIV బాధితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పోలీసులు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. HIV పాజిటివ్ కలిగిన మూడు జంటలకు పెళ్లిళ్లు చేశారు. మూడు ముళ్ల బంధంతో మూడు జంటలు ఏకమయ్యాయి. పోలీసులు..అధికారులే పెళ్లి పెద్దలుగా మారి వారిని నూరేళ్లు జీవించాలని దీవించారు.

హెచ్‌ఐవీ ఉన్నందున పెళ్లి కానీ ముగ్గురు యువతులను HIV పాజిటివ్ ఉన్న మరో ముగ్గురు యువకులకు ఇచ్చి పెళ్లి చేశారు. HIV ఉన్నంత మాత్రాన వారు సమాజానికి దూరంగా ఉండకూడదనే భావనతో వారికంటూ ఓ తోడూ నీడా ఉండాలనే ఉద్ధేశ్యంతో వారిని మూడు ముళ్ల బంధంతో ఒకటి చేశామని బీడ్ జిల్లా ఎస్పీ హర్ష పొదార్ తెలిపారు.

కాగా పెళ్లి చేసుకున్న ఈ జంటల్లో ఓ జంట దాదాపు 13 ఏళ్లుగా హెచ్ఐవీ పాజిటివ్ రోగులకు స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ.. జరిగిన ఈ ఆదర్శ వివాహం చూసి వీరి పెళ్లి చేసిన అధికారులను పలువురు అభినందించారు. నూతన వధూవరులు కలకాలం చల్లగా జీవించాలని దీవించారు.

Read Here>>70 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన 73 ఏళ్ల దివ్యాంగ వృద్ధుడు