Encounter
Three militants killed in encounter : ఎన్ కౌంటర్లతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతోంది. ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను ఏరివేస్తోంది. ఇవాళ మరో ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ ప్రాంతంలో జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను జవాన్లు హతమార్చారు. భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. షోపియాన్ లో ముష్కరుల కోసం భారత్ ఆర్మీ ముమ్మరం గాలింపు చర్యలు చేపట్టింది.